మధుమేహం వచ్చిందంటే.. క్లోమగ్రంధిలోని బీటా కణాలు అస్సలు పనిచేయవని.. ఈ లోపాన్ని సరిదిద్దుకోవడం సాధ్యం కాదన్నది అపోహ మాత్రమేనని నిరూపించారు న్యూక్యాజిల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఇటీవల తాము జరిపిన ఒక అధ్యయనంలో టైప్–2 మధుమేహంతో బాధపడుతున్న వారు బరువు తగ్గగానే సగం మందిలో వ్యాధి లక్షణాలు పూర్తిగా మాయమైపోయాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రాయ్ టేలర్ అంటున్నారు. మధుమేహం ఉన్నట్లు గుర్తించిన ఆరు ఏళ్లలోపు బరువు తగ్గిన వారిలో తాము ఈ విషయాన్ని గమనించామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 42.2 కోట్ల మంది మధుమేహులు ఉండగా... ఎక్కువ మంది బరువు తగ్గడంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని.. వ్యాధిబారిన పడిన వెంటనే గణనీయమైన స్థాయిలో బరువు తగ్గడం ద్వారా బీటా కణాలు పూర్తిగా నిర్వీర్యమైపోకుండా రక్షించుకోవచ్చునని ఆయన వివరించారు. బీటా కణాలు రక్తంలో ఎక్కువయ్యే గ్లూకోజు ఆధారంగా రెండు దఫాలుగా ఇన్సులిన్ ను విడుదల చేస్తుందని, టైప్–2 మధుమేహుల్లో ఒక దశలో మాత్రమే ఇన్సులిన్ విడుదలవుతున్నట్లు గుర్తించామని రాయ్ అంటున్నారు. బరువు తగ్గిన తరువాత తొలిదశ ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పనిచేయడం... తద్వారా రక్తంలోని గ్లూకోజు తగ్గడం తాము గుర్తించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment