పావుగంట ముందే గేట్లు బంద్
పావుగంట ముందే గేట్లు బంద్
Published Wed, May 31 2017 4:06 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM
- నేడు గురుకుల టీచర్ల స్క్రీనింగ్ టెస్టు
- ఉదయం 9.45 లోపే పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లాల్సిందే
- నిర్ణీత సమయం దాటితే అనుమతించేది లేదు
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యు యేట్ టీచర్ (టీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 31న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 211 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 1,25,635 మంది అభ్యర్థులు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 వరకు కొనసాగు తుందని తెలిపింది. పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.45 గంటలకే గేట్లు మూసివేస్తామని వెల్లడిం చింది. అభ్యర్థులు ఆ సమయంలోగానే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని సూచించింది. 9.45 తర్వా త అభ్యర్థులను అనుమతించేది లేదని తెలిపింది. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టుల వారు మినహా మిగతా టీజీటీ, పీజీటీ, పీడీ పోస్టుల వారికి ఈ స్క్రీనింగ్ టెస్టు ఉంటుం దని వివరించింది. అభ్యర్థుల ను ఉదయం 8.15 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని, వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.
వెంట తెచ్చుకోవాల్సినవి..
హాల్ టికెట్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్. ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు (పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, ప్రభుత్వ సంస్థ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్). మరిన్ని వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చైన్లు, చేతి గడియారాలు, ఆభరణాలు, షూస్ ధరించొద్దని, చివరకు పర్సు కూడా లోపలికి తీసుకురావద్దని సూచించింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ట్యాబ్స్, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు తెచ్చుకోవద్దని స్పష్టం చేసింది. ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు పరీక్ష హాల్లోకి తీసుకొస్తే డీబార్ చేస్తామని హెచ్చరించింది.
Advertisement
Advertisement