residential teachers
-
పావుగంట ముందే గేట్లు బంద్
- నేడు గురుకుల టీచర్ల స్క్రీనింగ్ టెస్టు - ఉదయం 9.45 లోపే పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లాల్సిందే - నిర్ణీత సమయం దాటితే అనుమతించేది లేదు సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యు యేట్ టీచర్ (టీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 31న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 211 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 1,25,635 మంది అభ్యర్థులు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 వరకు కొనసాగు తుందని తెలిపింది. పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.45 గంటలకే గేట్లు మూసివేస్తామని వెల్లడిం చింది. అభ్యర్థులు ఆ సమయంలోగానే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని సూచించింది. 9.45 తర్వా త అభ్యర్థులను అనుమతించేది లేదని తెలిపింది. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టుల వారు మినహా మిగతా టీజీటీ, పీజీటీ, పీడీ పోస్టుల వారికి ఈ స్క్రీనింగ్ టెస్టు ఉంటుం దని వివరించింది. అభ్యర్థుల ను ఉదయం 8.15 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని, వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. వెంట తెచ్చుకోవాల్సినవి.. హాల్ టికెట్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్. ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు (పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, ప్రభుత్వ సంస్థ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్). మరిన్ని వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందవచ్చు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చైన్లు, చేతి గడియారాలు, ఆభరణాలు, షూస్ ధరించొద్దని, చివరకు పర్సు కూడా లోపలికి తీసుకురావద్దని సూచించింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ట్యాబ్స్, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు తెచ్చుకోవద్దని స్పష్టం చేసింది. ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు పరీక్ష హాల్లోకి తీసుకొస్తే డీబార్ చేస్తామని హెచ్చరించింది. -
సెమినార్లే... చర్యలుండవు
- గురుకుల ఉపాధ్యాయుల ఆందోళనలపై ప్రభుత్వం స్పందన - సమ్మె కొనసాగుతుందన్న టీచర్లు సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ఉపాధ్యాయుల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చింది. ఉపాధ్యాయుల బోధనా ప్రమాణాలు పెంచేందుకు న్యూ క్వాలిటీ పాలసీ-2016(ఎన్క్యూపీ) పేరిట కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ రూ పొందించిన విధానాలను నిరసిస్తూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి బీఎండీ ఎక్కాను కలసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికారులతో సమావేశమైన మంత్రి.. ఉపాధ్యాయుల ఆందోళ నలపై చర్చించి మార్పులు చేసినట్లు ప్రవీణ్‌కుమార్ ఆదివారం ప్రకటించారు. సెమినార్ విధానాన్ని రద్దు చేయాలన్న ఉపాధ్యాయుల డిమాండ్‌ను పక్కనబెట్టి కొన్ని సడలింపులు ఇచ్చారు. న్యూ క్వాలిటీ పాలసీ, రూల్ 28, కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణకు సంబంధించి సవరణలు చేశారు. న్యూ క్వాలిటీ పాలసీలో మార్పులివే.. ► ఎన్క్యూపీ సెమినార్లలో భాగంగా 50 శాతం కన్నా తక్కువ మార్కులు సాధించిన ఉపాధ్యాయులను మళ్లీ సెమినార్లకు పిలవరు. వారిలో బోధనా ప్రమాణాలు పెం చేందుకు శిక్షణ ఇస్తారు. ► సెమినార్లు నిర్వహించే సమయంలో వీడియో రికార్డింగ్ విధానం నిలిపివేత ► రెండేళ్లలో పదవీ విరమణ చేసే వారికి, తీవ్రమైన జబ్బులు ఉన్నవారికి, గర్భిణిలకు సెమినార్ల నుంచి మినహాయింపు ► ఎన్క్యూపీ కింద సెమినార్లలో పాల్గొన్న టీచర్లపై చర్యలు ఉండవు ► పోస్టుతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తిస్తున్న వారు రూల్ 28 లోకి రారు ► రూల్ 28 పరిధిలోకి వచ్చే వారి విషయంలో జూనియర్ ఇంటర్, అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు ► కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. సమ్మెను నీరుగార్చే చర్యలివి: టీచర్ల జేఏసీ సంక్షేమ గురుకులాల్లో ప్రవేశపెట్టిన న్యూ క్వాలిటీ పాలసీ, ఇతర అంశాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలను నీరుగార్చేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని జేఏసీ నాయకులు వెంకటరెడ్డి, రవీందర్‌రెడ్డి, దయానంద్‌రావు, యాదయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. ఈనెల 14న జరపనున్న సమ్మెకు సంబంధించి నోటీసులోని డిమాండ్లన్నింటి పై మంత్రి నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు వెనక్కు తగ్గేది లేదన్నారు. 6,7 తేదీల్లో ఈ మెయిల్ క్యాంపెయిన్ కొనసాగుతుందని, 13న మహాధర్నాకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. -
గురుకులాల్లో నైపుణ్య శిక్షణ!
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు - ఇంగ్లిష్, కెరీర్ కౌన్సెలింగ్ తదితర అంశాలపై అవగాహన సాక్షి, హైదరాబాద్: జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల్లో కొత్త అధ్యాయాలు ఆవిష్కృతమవుతున్నాయి. వేసవి సెలవుల్లో రాష్ట్ర బీసీ గురుకులాల పరిధిలోని పాఠశాలలు, జూని యర్ కాలేజీలు, మహిళల డిగ్రీ కాలేజీ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు నాలుగైదు బ్యాచ్‌లుగా 2 వేల మందికి పైగా విద్యార్థులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. కింది తరగతుల్లో నేర్చుకున్న అంశాలు మర్చిపోకుండా వారికి గుర్తుండిపోయేలా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. దీంతో పాటు ఆటలు, పాటల్లో ఆసక్తి, నైపుణ్యం ఉండి ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రత్యేమైన శిక్షణ ఇవ్వనున్నారు. క్రీడలపై ఆసక్తి లేని వారు వివిధ చదువుకు సంబంధించిన అంశాల్లో నైపుణ్యం సాధించేలా చొరవ తీసుకుంటారు. వివిధ అంశాలపై పట్టు సాధించేలా.. రాష్ర్టంలోనే తొలిసారిగా బీసీ గురుకులాల ప రిధిలో మహిళల కోసం గతేడాది రెసిడెన్షియ ల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసిన విషయం తె లిసిందే. డిగ్రీ విద్యార్థినిలు, జూనియర్ కా లేజీ అమ్మాయిలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సంస్థ పరిధిలోని రెండు బాలుర జూనియర్ కాలేజీల్లోని 300 మందికి పైగా విద్యార్థులకు సి విల్ సర్వీస్ పరీక్షలపై అవగాహన కల్పిస్తారు. ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అయిన విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీలకు ప్రిపేర్ అయ్యే తీరు, ఆయా సబ్జెక్టులపై ఎలా పట్టు సాధించాలి వంటి అంశాలపై వివరిస్తారు. తొమ్మిది, పది తరగతులకు వెళ్లనున్న 1,500 మందికి 45 రోజుల పాటు ఇంగ్లిష్‌పై శిక్షణనిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 300పైగా 7, 8, 9 తరగతుల విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, కెరీర్ కౌన్సెలింగ్ అంశాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భవిష్యత్‌కు బాటలు వేసేలా.. వేసవి సెలవుల్లో విద్యార్థులు కింది తరగతుల్లో నేర్చుకున్న అంశాలు మర్చిపోతారు. అందుకే వారికి వేసవిలో కూడా చదువు కొనసాగించడంతో పాటు భవిష్యత్ ఆలోచనలు, ప్రణాళికలకు బాటలు వేసేలా ఆయా కార్యక్రమాలు రూపొందించాం. ఇంగ్లిష్‌పై పట్టు సాధించడంతో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యం పొందేందుకు ఈ తరగతులు ఉపయోగపడతాయి. నిపుణులైన అధ్యాపకులతో రెసిడెన్షియల్ తరహాలో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందిస్తాం. -మల్లయ్యభట్టు, బీసీ గురుకులాల కార్యదర్శి