- వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు
- ఇంగ్లిష్, కెరీర్ కౌన్సెలింగ్ తదితర అంశాలపై అవగాహన
సాక్షి, హైదరాబాద్: జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల్లో కొత్త అధ్యాయాలు ఆవిష్కృతమవుతున్నాయి. వేసవి సెలవుల్లో రాష్ట్ర బీసీ గురుకులాల పరిధిలోని పాఠశాలలు, జూని యర్ కాలేజీలు, మహిళల డిగ్రీ కాలేజీ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు నాలుగైదు బ్యాచ్‌లుగా 2 వేల మందికి పైగా విద్యార్థులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. కింది తరగతుల్లో నేర్చుకున్న అంశాలు మర్చిపోకుండా వారికి గుర్తుండిపోయేలా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. దీంతో పాటు ఆటలు, పాటల్లో ఆసక్తి, నైపుణ్యం ఉండి ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రత్యేమైన శిక్షణ ఇవ్వనున్నారు. క్రీడలపై ఆసక్తి లేని వారు వివిధ చదువుకు సంబంధించిన అంశాల్లో నైపుణ్యం సాధించేలా చొరవ తీసుకుంటారు.
వివిధ అంశాలపై పట్టు సాధించేలా..
రాష్ర్టంలోనే తొలిసారిగా బీసీ గురుకులాల ప రిధిలో మహిళల కోసం గతేడాది రెసిడెన్షియ ల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసిన విషయం తె లిసిందే. డిగ్రీ విద్యార్థినిలు, జూనియర్ కా లేజీ అమ్మాయిలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సంస్థ పరిధిలోని రెండు బాలుర జూనియర్ కాలేజీల్లోని 300 మందికి పైగా విద్యార్థులకు సి విల్ సర్వీస్ పరీక్షలపై అవగాహన కల్పిస్తారు. ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అయిన విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీలకు ప్రిపేర్ అయ్యే తీరు, ఆయా సబ్జెక్టులపై ఎలా పట్టు సాధించాలి వంటి అంశాలపై వివరిస్తారు. తొమ్మిది, పది తరగతులకు వెళ్లనున్న 1,500 మందికి 45 రోజుల పాటు ఇంగ్లిష్‌పై శిక్షణనిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 300పైగా 7, 8, 9 తరగతుల విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, కెరీర్ కౌన్సెలింగ్ అంశాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భవిష్యత్‌కు బాటలు వేసేలా..
వేసవి సెలవుల్లో విద్యార్థులు కింది తరగతుల్లో నేర్చుకున్న అంశాలు మర్చిపోతారు. అందుకే వారికి వేసవిలో కూడా చదువు కొనసాగించడంతో పాటు భవిష్యత్ ఆలోచనలు, ప్రణాళికలకు బాటలు వేసేలా ఆయా కార్యక్రమాలు రూపొందించాం. ఇంగ్లిష్‌పై పట్టు సాధించడంతో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యం పొందేందుకు ఈ తరగతులు ఉపయోగపడతాయి. నిపుణులైన అధ్యాపకులతో రెసిడెన్షియల్ తరహాలో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందిస్తాం.
-మల్లయ్యభట్టు, బీసీ గురుకులాల కార్యదర్శి