
సాక్షి, హైదరాబాద్: పోలీసు పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు నగర పోలీసు విభాగం ప్రీ–రిక్రూట్‌మెంట్ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు అర్హతలు, ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరింది. యువత నుంచి భారీగా స్పందన రావడంతో మొత్తం 20,733 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఉచిత శిక్షణకు అర్హులను ఎంపిక చేసేందుకు తొలిసారిగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
మంగళవారం నగరంలోని ఐదు జోన్లలోని 36 కేంద్రాల్లో తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో ఈ పరీక్ష జరుగనుంది. అర్థమెటిక్, రీజనింగ్ 100 మార్కులు, జనరల్ స్టడీస్ 100 మార్కులకు దీనిని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, దరఖాస్తు చేసుకున్న వారు విధిగా హాజరుకావాలని నగర పోలీసులు కోరుతున్నారు. హాల్ టికెట్లను లింకు రూపంలో ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు పంపించారు. సమాచారం అందని వారు పోలీసు అధికారిక వెబ్‌సైట్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లలోనూ సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment