యాకుత్‌పురా (హైదరాబాద్) : ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి తమ శాఖ ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు మీర్‌చౌక్ డివిజన్ ఏసీపీ ఎస్.గంగాధర్ సోమవారం వెల్లడించారు. డివిజన్‌లోని అర్హులైన అభ్యర్థులు డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ, కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కలిగి 167 సెం.మీ.ఎత్తున్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
డివిజన్ పరిధిలోని మొఘల్‌పురా, మీర్‌చౌక్, డబీర్‌పురా, రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో నివాసముండే అభ్యర్థులు ఈ నెల 5వ తేదీలోపు డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తులు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు డబీర్పురా (040-27854791), రెయిన్‌బజార్ (040-27854781), మీర్‌చౌక్ (040-27854797), మొఘల్‌పురా (040-27854783) స్టేషన్‌లలో సంప్రదించాలన్నారు.
పోలీసు ఉద్యోగాలకు పోలీస్ శాఖ ఉచిత శిక్షణ
Published Mon, Aug 3 2015 7:40 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement