ఏపీపీఎస్సీ నవంబర్ 8న విడుదల చేసిన గ్రూప్–2 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. మొత్తం 982 పోస్టులకు 6,55,279 మంది దరఖాస్తులు సమర్పించినట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 26న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టెస్టులో ఒక్కో పోస్టుకు దాదాపు 668 మంది చొప్పున పోటీ పడనున్నారు. స్క్రీనింగ్ టెస్టును ఓఎంఆర్ పత్రాల ఆధారంగా బహుళైచ్ఛిక సమాధానాల రూపంలో నిర్వహించనున్నారు.
Published Tue, Dec 20 2016 7:17 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement