వరంగల్: సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్), కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ మైదానాల్లో సోమవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభించారు. జూలై 1 వరకు వీటిని నిర్వహించనున్నారు. అంతకుముందు అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్‌లను కేయూ గ్రౌండ్స్‌లో డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా ప్రారంభించగా, జేఎన్‌ఎస్‌లో సీపీ జి.సుధీర్‌బాబు ప్రారంభించారు.
ఉదయం ఐదు గంటలకు స్టేడియానికి చేరుకున్న అభ్యర్థుల వేలిముద్రలను బయోమెట్రిక్ విధానం ద్వారా సేకరించారు. వారి ధ్రువపత్రాలను పరిశీలించి, ఎత్తు, ఛాతీ కొలతలను తీసుకున్నారు. ఈ ప్రక్రియను ఆయూ మైదానాల్లో డీఐజీ, ఎస్పీ, సీపీ పర్యవేక్షించారు. నిబంధనల మేరకు శారీరక కొలతలు ఉన్న వారికి 100, 800 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్ విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. ప్రతి క్రీడాంశానికి ఒక ఏసీపీ స్థాయి పోలీస్ అధికారిని ఇన్‌చార్జిగా నియమించడంతో పాటు వారికి సహాయకంగా ఒక ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉన్నారు.అభ్యర్థులకు గాయూలు లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణం చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.
ప్రతి అభ్యర్థి కనీసం మూడు క్రీడాంశాలలో తప్పక అర్హత సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించాల్సిన మూడు విభాగాల్లో 800 మీటర్ల పరుగు పందెం తప్పనిసరిగా ఉండాలి. వీటిలో క్వాలిఫై అయ్యేవారు త్వరలో నిర్వహించనున్న తుది దశ రాత పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హత సాధిస్తారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ యాదయ్య, పరిపాలన అధికారిణి స్వరూపారాణి, ఏసీపీ శోభన్‌కుమార్, జనార్ధన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్‌రావు, ఈశ్వర్‌రావు, రవీందర్‌రావు, రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
సర్వర్ మొరాయించడంతో ఇక్కట్లు ..
ఫిజికల్ టెస్ట్‌లకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమంలో సర్వర్ నెమ్మదించింది. దీంతో ఆ ప్రక్రియలో కాస్త జాప్యం జరిగింది. ఫలితంగా తెల్లవారుజామునే మైదానాలకు చేరుకున్న అభ్యర్థులు క్యూలైన్‌లో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా రన్నింగ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఉదయం నుంచి ఆహారం తీసుకోకుండా వేచిచూసిన అభ్యర్థులు నీరసించిపోయారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహిస్తామని అధికారులు తెలపడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఆహారం తీసుకోకుండా వేచిచూసి తాము నీరసించిపోయూమని, ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈవెంట్స్ చేయడం మరింత ఇబ్బందిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో మిగిలిన అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను మరుసటి రోజుకు వాయిదా వేశారు.
ఎస్సై అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్లు
Published Tue, Jun 28 2016 10:14 AM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM
Advertisement