TSLPRB Releases Final Written Examination Schedule, Check Details Inside - Sakshi
Sakshi News home page

TS: ‘పోలీస్‌’ తుది పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

Published Mon, Jan 2 2023 1:36 AM | Last Updated on Mon, Jan 2 2023 9:23 AM

Civil SI written exam on 8th and 9th April In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫామ్‌ సర్వీసెస్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలకమైన తుది రాత పరీక్ష తేదీల షెడ్యూల్‌ ఖరారైంది. మార్చి 12 నుంచి పలు విభాగాల్లోని 17,560 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో పోలీస్‌ ఉద్యోగార్థులు తీవ్రంగా శ్రమించే సివిల్‌ ఎస్సై పోస్టులకు రాత పరీక్షను ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు.

సివిల్‌ కానిస్టేబుల్‌ తుది రాత పరీక్షను ఏప్రిల్‌ 23న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పరీక్షల తేదీలను వెల్లడిస్తూ ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు సన్నద్ధం కావాలని సూచించారు.  

ఈనెల 5తో ముగియనున్న దేహదారుఢ్య పరీక్షలు
పలు విభాగాల్లోని ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ­కి సంబంధించి దేహదారుఢ్య పరీక్ష­లు డిసెంబర్‌ 8న ప్రారంభించారు. ఈ ప్రక్రియ జనవరి 5తో ముగియనుంది. హైదరాబాద్‌సహా తెలంగాణ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఫిజికల్‌ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు.

దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష హాల్‌టికెట్లను త్వరలోనే జారీ చేయనున్నట్టు బోర్డు అధికారులు తెలి­పారు.  డ్రైవర్, డ్రైవర్‌ ఆపరేటర్స్, మెకా­నిక్‌ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్థులకు డ్రైవింగ్‌ టెస్ట్‌ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement