posts recruitment
-
వైద్య పోస్టుల భర్తీకి బోర్డు
సాక్షి, అమరావతి: ప్రజలకు నిరంతరం నాణ్యమైన వైద్య సేవలందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా ఎప్పటి పోస్టులు అప్పుడు భర్తీ చేస్తున్నారు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంఎస్ఆర్బీ)ని ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. మెంబర్ సెక్రటరీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, మరో మెంబర్‌గా జాయింట్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. ఈ బోర్డు కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. డీహెచ్, ఏపీవీవీపీ, డీఎంఈ పరిధుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రాష్ట్ర స్థాయిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేస్తారు. పదోన్నతుల ద్వారా డిప్యూటి సివిల్ సర్జన్, సివిల్ సర్జన్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియను సంబంధిత విభాగాధిపతుల కార్యాలయాల ద్వారానే చేపడుతున్నారు. ఇకపై ఈ నియామకాలను బోర్డు చేపడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. ప్రస్తుతం వెబ్సైట్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో బోర్డు కార్యకలాపాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని మెంబర్ సెక్రటరీ ఎం. శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోస్టుల భర్తీ ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల తాకిడికి అనుగుణంగా మానవ వనరులను సమకూర్చడానికి సీఎం జగన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వైద్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2019 నుంచి ఇప్పటివరకు 49 వేల వరకు పోస్టులను భర్తీ చేసింది. అంతేకాకుండా ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా అత్యవసర అనుమతులను ఇచ్చింది. వైద్య శాఖలో 4 వారాలకు మించి ఏ పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేదని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. -
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్–2022 పరీక్షల తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో పాటు 50 వరకు ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించారు. సివిల్స్–2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, తదితర సర్వీసుల పోస్టులకు సంబంధించి మొత్తం 933 మందిని ఎంపికి చేసినట్లు తెలిపింది. జనరల్ – 345, ఈడబ్ల్యూఎస్ – 99, ఓబీసీ – 263, ఎస్సీ – 154, ఎస్టీ – 72 మంది ఎంపికయ్యారు. వీరితో పాటు కన్సాలిడేటెడ్ రిజర్వు లిస్టులో ఆయా కేటగిరీల నుంచి 178 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. మొత్తంగా 1,022 మందిని ఆయా పోస్టులకు ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరిలో ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్ఎస్కు 38 మంది, ఐపీఎస్‌కు 200 మందిని కేటాయించారు. ఇతర కేంద్ర సర్వీసెస్‌లకు సంబంధించి గ్రూప్–ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్–బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అధిక ర్యాంకులు సివిల్స్ ఫలితాల్లో టాప్ ర్యాంకుల్లో తొలి 4 ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకును ఇషితా కిషోర్ సాధించగా గరిమ లోహియా, నూకల ఉమా హారతి, స్మృతి మిశ్రాలు వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి దాదాపు 50 మందికి ర్యాంకులు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 22, 33, 40, 200, 217, 222, 285, 384, 410, 460, 510, 558, 583, 593, 640, 759, 801, 827, 885 ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. జీవీఎస్ పవన్ దత్తా 22, తరుణ్ పట్నాయక్ 33, అజ్మీరా సంకేత్ 35, శ్రీసాయి ఆశ్రిత్ శాఖమూరి 40, హెచ్ఎస్ భావన 55, సాయి ప్రణవ్ 60, ఆవుల సాయికృష్ణకు 94వ ర్యాంకు దక్కాయి. వీరితోపాటు నిధిపాయ్ 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి సంపత్‌కుమార్ 157, కమతం మహేశ్‌కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, సాహిత్య 243, అంకుర్ కుమార్ 257, బొల్లం మహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కళ్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, సాయికృష్ణకు 293వ ర్యాంకు వచ్చాయి. 11.35 లక్షల మంది దరఖాస్తు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 11.35 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 5.73 లక్షల మంది (50.51 శాతం) మంది మాత్రమే గతేడాది జూన్ 5న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. వారిలో 130,90 మంది మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,529 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా చివరకు 933 మంది ఎంపికయ్యారు. కాగా సివిల్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 80,707 మంది హాజరయ్యారు. వారిలో 500 మంది వరకు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇంటర్వ్యూలకు 100 మంది వరకు ఎంపికవ్వగా వారిలో 50 మంది వరకు ర్యాంకులు సాధించగలిగారని ఆయా కోచింగ్ సంస్థల నిర్వాహకులు తెలిపారు. ర్యాంకుల వారీగా తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులు 3 ఎన్. ఉమా హారతి 22 జీవీఎస్ పవన్ దత్తా 33 తరుణ్ పట్నాయక్ మాదల 40 సాయి ఆశ్రిత్ శాఖమూరి 54 రిచా కులకర్ణి 60 మలియె శ్రీ ప్రణవ్ 78 ఉత్కర్‡్షకుమార్ 87 అయాన్ జైన్ 94 ఆవుల సాయి కృష్ణ 110 నిధి పాయ్ 132 అనుగు శివమూర్తిరెడ్డి 157 రాళ్లపల్లి వసంతకుమార్ 189 షేక్ హబీబుల్లా 217 రావ్ల జయసింహారెడ్డి 243 కాసిరాజు పవన సాయి సాహిత్య 270 బొల్లం ఉమామహేశ్వరరెడ్డి 285 చల్లా కల్యాణి 292 పలువాయి విష్ణువర్థన్‌రెడ్డి 293 గ్రంధి సాయికృష్ణ 297 షివిన్ చౌదరి 311 వీరగంధం లక్ష్మీ సునీత 313 కె.ఎన్.చందన్ జాహ్నవి 346 ఎన్.చేతన్‌రెడ్డి 384 తెప్పలపల్లి సుశ్మిత 409 ఇషాన్ అగర్వాల్ 410 డొంగ్రె రేవయ్య 414 చంద్రశేఖర్ శంకల 426 సీహెచ్. శ్రవణ్‌కుమార్‌రెడ్డి 459 చాణక్య ఉదయగిరి 464 సి.సమీరారాజా 469 బొడ్డు హేమంత్ 480 గోపీకృష్ణ. బి 510 భువన ప్రణీత్ పప్పుల 548 దామెర్ల హిమవంశీ 558 రుత్విక్ సాయి కొట్టే 559 డి.మనోజ్ 583 యర్రంశెట్టి ఉషారమణి 630 ఎస్.దీప్తి చౌహాన్ 640 తుమ్మల సాయికృష్ణారెడ్డి 742 రామ్‌దేని సాయినాధ్ 759 జి.అక్షయ్ దీపక్ 805 మన్నం సుజిత్ సంపత్ 817 సాహిల్ మీనా 846 బెండుకూరి మౌర్యతేజ్ 866 నాగుల కృపాకర్ సీఎం వైఎస్ జగన్ అభినందనలు సివిల్స్ పరీక్షల్లో 200లోపు ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 933 మందితో కూడిన తుది జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు అభ్యర్థులందరికీ సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. వారు కెరీర్లో ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ర్యాంకర్ల అభిప్రాయాలు దత్తా.. సత్తా అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన డాక్టర్ పవన్ దత్తా సివిల్స్‌లో 22వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. దత్తా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. ఎంబీబీఎస్ చదివిన పవన్ దత్తా హైదరాబాద్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా పవన్ దత్తా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉన్నత ఆరోగ్య సేవలు, పేద విద్యార్థులకు సాంకేతిక సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని తెలిపాడు. అంబికా జైన్‌కు 25వ ర్యాంక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లలిత్‌కుమార్ అంబికా జైన్ (25) సివిల్స్‌లో 69వ ర్యాంక్ సాధించారు. పట్టణానికి చెందిన జైన్ ఎలక్ట్రికల్ షాపు యజమాని లలిత్‌కుమార్, అనితల కుమార్తె అంబికా జైన్ అత్యుత్తమ ర్యాంకుతో మెరిసింది. అంబిక.. ఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎంఏ చేశారు. గతేడాది మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 128వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయినా ఐఏఎస్ కావాలనే పట్టుదలతో ఈ ఏడాది మళ్లీ ప్రయత్నించి 69వ ర్యాంక్‌తో లక్ష్యాన్ని చేరుకున్నారు. 33వ ర్యాంకుతో మెరిసిన తరుణ్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోడల్ కాలనీకి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకుతో సత్తా చాటాడు. ఐఐటీ గౌహతిలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తరుణ్ సివిల్స్‌కు సొంతంగా సిద్ధమయ్యాడు. తరుణ్ తండ్రి రవికుమార్ ఎల్ఐసీ రూరల్ బ్రాంచ్‌లో క్లరికల్ స్టాఫ్‌గా పనిచేస్తుండగా తల్లి శారదా రాజ్యలక్ష్మి గృహిణి. తరుణ్ గౌహతి ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. సివిల్స్‌కు సొంతంగానే ప్రిపేరయ్యారు. గతేడాది 99వ ర్యాంకు సాధించిన అతడు ఈసారి 33వ ర్యాంకుతో మెరిశాడు. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని తరుణ్ తెలిపాడు. వసంత్‌కు 157వ ర్యాంకు ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన రాళ్లపల్లి వసంతకుమార్ 157వ ర్యాంకుతో మెరిశాడు. సివిల్స్ 2021 పరీక్షల్లో 170వ ర్యాంకు సాధించిన వసంతకుమార్ అప్పట్లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్ సాధించాలన్న సంకల్పంతో మరోసారి ప్రయత్నం చేయగా 157వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. వసంత్ అన్న జగన్‌సాయి ప్రస్తుతం ఐఏఎస్‌కు ఎంపికై శిక్షణలో ఉన్నారు. వసంతకుమార్ తండ్రి రాళ్లపల్లి భీమేశ్వరరావు విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి అనసూయ గృహిణి. సిక్కోలు బిడ్డకు 285వ ర్యాంకు శ్రీకాకుళం జిల్లా రూరల్ మండల పరిధిలోని వప్పంగి గ్రామానికి చెందిన చల్లా కళ్యాణి 285వ ర్యాంకుతో సత్తా చాటింది. ఇప్పటికే గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించిన ఆమె ప్రస్తుతం విశాఖపట్నంలోని ట్రెజరీ విభాగంలో శిక్షణ తీసుకుంటోంది. పల్నాడు యువకుడికి సివిల్స్‌లో 292వ ర్యాంక్ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన పాల్వాయి విష్ణువర్ధన్‌రెడ్డి 292వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. గోవాలోని బిట్స్ పిలానీలో బీటెక్ ఈఈఈ పూర్తిచేశాక ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)– 2020లో 3వ ర్యాంక్ సాధించాడు. అయితే ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. తన ఐదో ప్రయత్నంలో 292వ ర్యాంక్ సాధించి విజయకేతనం ఎగురవేశాడు. విష్ణువర్ధన్‌రెడ్డిని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తదితరులు అభినందించారు. విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి విజయవాడలో ఒక ప్రైవేటు కోచింగ్ అకాడమీ డైరెక్టర్‌గా, తల్లి పద్మావతి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. లక్ష్మీ సుజితకు 311వ ర్యాంకు బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన వీరగంధం లక్ష్మీసుజిత 311వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఆమె తండ్రి స్థానికంగా విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన సుజిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమైంది. కాగా ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా వచ్చే ఏడాది మళ్లీ సివిల్స్ రాస్తానని సుజిత తెలిపింది. ఐదో ప్రయత్నంలో విజయకేతనం పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బొల్లిపల్లి వినూత్న. ఆమె ఐదో ప్రయత్నంలో 462వ ర్యాంకు సాధించింది. వినూత్న తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వినూత్న కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేస్తూ ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంది. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్, రెండో ప్రయత్నంలో మెయిన్స్, మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో విఫలమైంది. నాలుగో ప్రయత్నమూ నిరాశపరిచింది. అయితే పట్టు వదలకుండా ఐదోసారి విజయకేతనం ఎగురవేసింది. ఐఏఎస్ రాసే క్రమంలో గ్రూప్–1 రాసి ఇంటర్వ్యూకు ఎంపికయ్యానని.. అయితే దానికి హాజరుకానని వినూత్న వెల్లడించింది. తన లక్ష్యం ఐఏఎస్ అని స్పష్టం చేసింది. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి కుమారుడికి 469 ర్యాంకు విశాఖ స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ విభాగం ఉద్యోగి బొడ్డు సత్తిబాబు కుమారుడు హేమంత్ 469వ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఈ ర్యాంకు ద్వారా ఐఆర్ఎస్ వస్తుందని.. మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని హేమంత్ తెలిపారు. నవీన్ చక్రవర్తికి 550వ ర్యాంకు పల్నాడు జిల్లా తాళ్లచెరువు గ్రామానికి చెందిన రేపూడి నవీన్ చక్రవర్తి 550వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ,లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన నవీన్ సివిల్స్‌పై ఆసక్తితో అటు మళ్లాడు. తొలి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయిన ఆయన రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లలో ఏది వచ్చినా స్వీకరిస్తానని తెలిపాడు. కోనసీమ జిల్లా యువతికి 583వ ర్యాంక్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన యర్రంశెట్టి ఉమా శ్రీలక్ష్మీరమణి 583వ ర్యాంకుతో సత్తా చాటింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చదివిన ఆమె క్యాంపస్ సెలక్షన్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించింది. శ్రీలక్ష్మీరమణి తండ్రి యర్రంశెట్టి కాశీవిశ్వేశ్వరరావు కొబ్బరికాయల వ్యాపారి. కాగా యానాం మున్సిపల్ కమిషనర్ ద్విజ్ గోయల్ 71వ ర్యాంకు సాధించారు. గోయల్ సొంత పట్టణం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్. సంతోష్‌కు 607వ ర్యాంకు శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఖండ్యాం గ్రామానికి చెందిన భవిరి సంతోష్‌కుమార్ 607వ ర్యాంకు సాధించారు. ఈయన స్వగ్రామం ఖండ్యాం అయినప్పటికీ మండలంలోని అలుదు గ్రామంలో తాతయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు గతేడాది సివిల్స్‌లోనూ 607వ ర్యాంకే ఈసారి కూడా అదే ర్యాంక్ వచ్చింది. సంతోష్ తండ్రి రాజారావు విశ్రాంతి ఉపాధ్యాయుడు, తల్లి ఉమాకుమారి గృహిణి. విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, హైదరాబాద్‌లోని రైల్వే కళాశాలలో డెర్మటాలజీలో పీజీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ డెర్మటాలజిస్టుగా పనిచేస్తున్నాడు. సివిల్స్ సాధించాలని ఇప్పటికే ఐదుసార్లు పరీక్ష రాయగా ఆరో ప్రయత్నంలో 607వ ర్యాంకు సాధించారు. రవికిరణ్‌కు 694వ ర్యాంకు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంకు చెందిన పుసులూరి రవికిరణ్ 694వ ర్యాంకు సాధించాడు. గతంలో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్ఎస్)కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర కార్పొరేట్ ఎఫైర్స్ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా మరోసారి ప్రయత్నిస్తానని రవికిరణ్ తెలిపాడు. ఎన్టీఆర్ జిల్లా యువకుడికి 805వ ర్యాంక్ సివిల్స్ తుది ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన మన్నం సుజిత్ సంపత్‌కు 805వ ర్యాంక్ లభించింది. ఈ సందర్భంగా సుజిత్ మాట్లాడుతూ ఐఏఎస్ అవ్వాలన్నదే తన కోరికన్నారు. నాలుగేళ్ల శ్రమ ఫలితంగా మంచి ర్యాంక్ వచ్చిందని తెలిపారు. ఐఏఎస్ అయ్యేంతవరకు శ్రమిస్తూనే ఉంటానన్నారు. సుజిత్‌ను నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు. కడప కుర్రాడికి 866వ ర్యాంకు కడప ప్రకాష్‌నగర్‌కు చెందిన నాగుల కృపాకర్ 866వ ర్యాంకు సాధించాడు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో బీటెక్ ఈఈఈ పూర్తి చేశాక సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. వరుసగా ఐదుసార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో 866వ ర్యాంకు సాధించాడు. తనకు ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని కృపాకర్ తెలిపాడు. రానున్న రోజుల్లో మరింత మంచి ర్యాంకు సాధించేందుకు ప్రిపరేషన్ కొనసాగిస్తానని తెలిపాడు. -
TS: ‘పోలీస్’ తుది పరీక్షల షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలకమైన తుది రాత పరీక్ష తేదీల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 12 నుంచి పలు విభాగాల్లోని 17,560 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో పోలీస్ ఉద్యోగార్థులు తీవ్రంగా శ్రమించే సివిల్ ఎస్సై పోస్టులకు రాత పరీక్షను ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. సివిల్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షను ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పరీక్షల తేదీలను వెల్లడిస్తూ ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈనెల 5తో ముగియనున్న దేహదారుఢ్య పరీక్షలు పలు విభాగాల్లోని ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ 8న ప్రారంభించారు. ఈ ప్రక్రియ జనవరి 5తో ముగియనుంది. హైదరాబాద్‌సహా తెలంగాణ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఫిజికల్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష హాల్‌టికెట్లను త్వరలోనే జారీ చేయనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్స్, మెకానిక్ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు. -
స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీకి రాజీలేని చర్యలు
సాక్షి, అమరావతి: వైద్యారోగ్య శాఖలో స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం రాజీ లేకుండా చర్యలు చేపడుతోందని ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి ఓ వైపు పలు రకాలుగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే.. ప్రభుత్వ సేవల్లో చేరడానికి స్పెషలిస్ట్ వైద్యులు ఆసక్తి చూపడం లేదంటూ పచ్చ పత్రికలో కథనాలు రాస్తున్నారు. ఆ వార్తలను ఖండిస్తూ కమిషనర్ వినోద్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే.. 61 శాతం స్పెషలిస్ట్, 50 శాతం జనరల్ ఫిజిషియన్ల కొరత ఉందని పేర్కొన్నారు. అదే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వైద్యుల అందుబాటులో దేశంలోనే ఏపీ అగ్ర స్థానంలో నిలుస్తోందని తెలిపారు. 2019 జూన్ నాటికి ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 1,250 స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉండేదని, ఈ క్రమంలో ఎనిమిది నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా 277 గైనిక్, 234 అనస్తీషియా, 146 పీడియాట్రిషన్, 144 జనరల్ మెడిసిన్, 168 జనరల్ సర్జన్, 55 ఆర్థో, 78 ఆప్తామాలజీ, 65 ఈఎన్టీ, మిగిలిన స్పెషాలిటీల్లో 145 పోస్టులు భర్తీ చేసినట్టు తెలిపారు. 403 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి గత అక్టోబర్ వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించగా 251 పోస్టులు భర్తీ అయినట్టు తెలిపారు. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 250 పోస్టుల భర్తీకి తాజాగా వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 110 పోస్టులను భర్తీ చేశామని వెల్లడించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు సహకరించక, పలు పోస్టుల్లో అభ్యర్థులు లేకనే కొన్ని పోస్టులు భర్తీ అవ్వడం లేదని వివరించారు. స్పెషలిస్ట్ వైద్యులను ప్రభుత్వ సేవల్లోకి ఆకర్షించడం కోసం అన్ని చర్యలనూ ప్రభుత్వం తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గ్రామీణంలో రూ.2 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.2.50 లక్షల వేతనాన్ని కూడా ఇస్తున్నామని తెలిపారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా చింతూరు, కూనవరం, పాడేరు వంటి ఆస్పత్రులనూ ఎంపిక చేసుకుని వైద్యులు చేరుతున్నట్టు ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. -
ఏపీలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్
-
ఏపీ పోలీసు శాఖలో నోటిఫికేషన్ రిలీజ్.. రాత పరీక్ష ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. పోలీసుశాఖలో భారీ సంఖ్యలో నియామకాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా, ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో భాగంగా 6,100 పోలీస్ కానిస్టేబుల్స్, 420 ఎస్ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఇక, ఫిబ్రవరి 19న ఎస్ఐ పోస్టులకు, జనవరి 22న కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించునున్నారు. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులలో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించారు. -
2018 డీఎస్సీలో భర్తీ కాని ఖాళీల నియామకాలకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2018 డీఎస్సీలో కోర్టు కేసులు, వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన రూపొందించిన జాబితాలోని అభ్యర్థులతో భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా రాష్ట్ర ఐటీసెల్ సమాచారం పంపాలన్నారు. షెడ్యూల్ తేదీలు ఇలా.. ప్రొవిజినల్ జాబితా వెల్లడి: ఈనెల 20 తుది జాబితా ఖరారు: 21 ఎస్ఎంఎస్ సమాచారం: 22 ధ్రువపత్రాల అప్లోడ్: 23, 24 ధ్రువపత్రాల పరిశీలన: 24 నుంచి 28 వరకు ఖాళీల ప్రదర్శన: 29 కౌన్సెలింగ్, నియామక ఉత్తర్వులు: 30, 31 చదవండి: ‘విద్య అందుబాటు’లో ఏపీ టాప్ -
అన్నింటికీ ఒక్కడే
సంఘాలు ఎన్నో.. పోస్టులు కొన్నే..! నగర పంచాయతీ ‘మెప్మా ’విభాగంలో ఖాళీలతో తిప్పలు పట్టించుకోని అధికారులు జోగిపేట: జోగిపేట నగర పంచాయతీలోని మెప్మా విభాగంలో అన్ని పోస్టులు ఖాళీగా ఉండటంతో డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో 20 వార్డులకు గాను సమాఖ్యలకు సంబంధించి 350 గ్రూపుల్లో 4,300 మంది సభ్యులున్నారు. ఆయా సంఘాల్లో పొదుపులు, బ్యాంకు ఖాతాల నిర్వహణ, రుణాల మంజూరు, తిరిగి చెల్లింపులు, స్వయం ఉపాధి రుణాల మంజూరు అంశాల్లో మెప్మా సిబ్బంది మహిళా సంఘాలకు సహాయం చేయాల్సి ఉంటుంది. మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు వారికి అవసరమైన సహకారం అందించి వారు స్వయం సమృద్ధి సాధించేలా చూడాలి. జోగిపేట, అందోలును కలిపి మూడేళ్ల క్రితం నగర పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మెప్మా సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. 500 గ్రూపుల ఇళ్లకు ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉండాలి. పట్టణంలో కనీసం ముగ్గురికిపైగా సీఓలు ఉండాలి. ఒక టౌన్ మిషన్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, టీడబ్ల్యూడీ వలంటీర్లు ఉండాలి. టీఎంసీ(టౌన్ మిషన్ కోఆర్డినేటర్)లు ప్రభుత్వ పథకాలపై మహిళలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. మెప్మా సోషల్ వెల్ఫేర్పై తెలియజేయాలి. కమ్యూనిటీ ఆర్గనైజర్లు వారి పరిధిలోని మహిళా గ్రూపులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచలను చేయాలి. డాటా ఎంట్రీ ఆపరేటర్‌ది కూడా ముఖ్యమైన బాధ్యతనే. సంబంధిత శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు గ్రూపుల వివరాలను తెలియజేయాలి. టీడబ్ల్యూడీ వలంటర్ గ్రూపులోని వికలాంగులుగా ఉన్న సభ్యులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రోత్సాహకాలను తెలియజేయాలి. ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సిన సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తోంది. బ్యాంకు లింకేజీ ద్వారా గ్రూపుల్లో సభ్యులకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు మంజూరు చేశారు. అన్నింటికీ ఒక్కడే మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చూస్తోంది. డ్వాక్రా గ్రూపు మహిళలకు రుణాలను బ్యాంకుల ద్వారా అందజేస్తోంది. అలాంటి విభాగానికి పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం జోగిపేట నగర పంచాయతీలో కమ్యూనిటీ ఆర్గనైజర్ ఒక్కరే పని చేస్తున్నారు. ఆయన ఇన్చార్జి టీఎంసీ, సీఓ, డాటా ఎంట్రీ ఆపరేటర్, టీడబ్ల్యూడీగా వ్యవహరిస్తున్నారు. 4,300 మంది మహిళా సభ్యులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మూడేళ్లయినా ప్రభుత్వం ముగ్గురు అధికారులను నియమించకపోవడం విచారకరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డ్వాక్రా గ్రూపు మహిళలు కోరుతున్నారు. సిబ్బంది తక్కువ నగర పంచాయతీలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. ఇన్చార్జి టీఎంసీ ఒక్కరే అన్ని బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పోస్టులు ఖాళీగా ఉండటంతో గ్రూపుల మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో రుణాలు. సలహాలు, సూచనలు అందడం లేదు. ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు మహిళలకు తెలియజేసే బాధ్యత సిబ్బందిదే. పూర్తి స్తాయి సిబ్బందిని నియమించాలి. - కళావతి, గ్రూపు లీడర్ ఖాళీలు వాస్తవమే జోగిపేట నగర పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి మెప్మా విభాగంలో అవసరమైన సిబ్బందిని నియమించకపోవడంతో పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. టీఎంసీ, సీఓ టీడబ్ల్యూడీ, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీఓగా ఉన్న నేను కొన్ని సంవత్సరాలుగా ఇన్చార్జి టీఎంసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సిబ్బంది లేకున్నా అన్ని రకాల విధులను నిర్వహిస్తున్నా. - భిక్షపతి, మెప్మా ఇన్చార్జి టీఎంసీ ఖాళీలను భర్తీ చేయాలి నగర పంచాయతీలో మెప్మా విభాగంలో ఉన్న టీఎంసీ, సీఓ, టీడబ్ల్యూడీ, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖాళీల కారణంగా గ్రూపుల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కరే అన్ని బాధ్యతలను చూడాల్సి వస్తోంది. నాలుగు వేలకుపైగా మహిళలున్నారు. ప్రభుత్వం మెప్మా సిబ్బందిని నియమించి సమస్యను పరిష్కరించాలి. - ఎస్.కవిత సురేందర్‌గౌడ్, చైర్పర్సన్ -
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో కొత్తగా మంజూరు చేసిన ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మెండ ప్రవీణ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రణస్థలం మండలం రావాడ, సంతకవిటి మండలం మండవ కురిటి, రేగిడి ఆమదాలవలస మండలం బూరాడ, జి.సిగడాం మండలం బాతువ, జలుమూరు మండలం సవిరిగాం తదితర పీహెచ్‌సీల్లో వైద్యాధికారుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం పది పోస్టుల్లో ఐదు పురుష, ఐదు మహిళలకు కేటాయించామన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి సన్నాహాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వర్సిటీల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని బుధవారం నిర్వహించిన సమీక్ష సమావే శంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు, వాటికి వెచ్చించాల్సిన బడ్జెట్ వివరాలను అందజేయాలని సీఎం కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు వర్సిటీల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 30, ఉస్మానియాలో 669 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. మిగతా వర్సిటీల్లో ఖాళీల వివరాలు, వాటి భర్తీకి చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారానే నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి హోదా, ప్రత్యేక నియామక విభాగాలున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీకి ఆ బాధ్యతలనిస్తే సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతాయా... అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై వర్సిటీల అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో(జేఎన్టీయూహెచ్) పోస్టుల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం వర్సిటీని వివరణ అడిగినట్లు తెలిసింది. భర్తీ విధానంతోపాటు గతంలో భర్తీ చేసిన పోస్టులు, కోర్టు వివాదాలపైనా చర్చించినట్లు తెలిసింది.