మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Published Fri, Jul 22 2016 12:51 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో కొత్తగా మంజూరు చేసిన ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మెండ ప్రవీణ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రణస్థలం మండలం రావాడ, సంతకవిటి మండలం మండవ కురిటి, రేగిడి ఆమదాలవలస మండలం బూరాడ, జి.సిగడాం మండలం బాతువ, జలుమూరు మండలం సవిరిగాం తదితర పీహెచ్‌సీల్లో వైద్యాధికారుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం పది పోస్టుల్లో ఐదు పురుష, ఐదు మహిళలకు కేటాయించామన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement