AP: DSC 2018 Posts Replacement Schedule Released And Details In Telugu - Sakshi
Sakshi News home page

2018 డీఎస్సీలో భర్తీ కాని ఖాళీల నియామకాలకు షెడ్యూల్‌

Published Sat, Dec 18 2021 11:14 AM | Last Updated on Sat, Dec 18 2021 1:56 PM

DSC 2018 Posts Replacement Schedule Released In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2018 డీఎస్సీలో కోర్టు కేసులు, వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ ప్రాతిపదికన రూపొందించిన జాబితాలోని అభ్యర్థులతో భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కె.నాగేశ్వరరావు శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేశారు. అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా రాష్ట్ర ఐటీసెల్‌ సమాచారం పంపాలన్నారు.
షెడ్యూల్‌ తేదీలు ఇలా..
ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి: ఈనెల 20
తుది జాబితా ఖరారు: 21
ఎస్‌ఎంఎస్‌ సమాచారం: 22
ధ్రువపత్రాల అప్‌లోడ్‌: 23, 24
ధ్రువపత్రాల పరిశీలన: 24 నుంచి 28 వరకు
ఖాళీల ప్రదర్శన: 29
కౌన్సెలింగ్, నియామక ఉత్తర్వులు: 30, 31 

చదవండి: ‘విద్య అందుబాటు’లో ఏపీ టాప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement