సర్కారు దొంగాట.. 7 నెలలు గడిచినా అతీగతీ లేని నోటిఫికేషన్
కూటమి అధికారంలోకి రాగానే 16,347 పోస్టులు ప్రకటన
జిల్లాల్లో ఖాళీల లెక్కలు చెప్పాలని మరోసారి ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టులను ప్రకటించారు. డిసెంబర్ నాటికి భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ఏడు నెలలు దాటినా నోటిఫికేషన్ ప్రకటించకపోగా.. వాయిదాలకు మరిన్ని కారణాలు వెదుకుతున్నట్టు తెలుస్తోంది.
తాజాగా జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు అందించాలని మరోసారి విద్యాశాఖను కోరడం గమనార్హం. దీంతో ప్రభుత్వం గతంలో ప్రకటించిన 16,347 పోస్టుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించినన్ని పోస్టులు లేకపోవడంతోనే నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు జూన్ 13న మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు.
దీంతో సెప్టెంబర్‌లో డీఎస్సీ పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని స్వయానా ముఖ్యమంత్రే ప్రకటించడంతో అర్హత గల అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అయితే, కొత్తగా బీఈడీ చేసిన వారికి కూడా అవకాశం కల్పించేందుకు జూలైలో ఏపీ టెట్–2024 నోటిఫికేషన్ జారీ చేశారు. టెట్ పూర్తయి మూడు నెలలు గడిచిపోయింది. అయినా.. డీఎస్సీ నిర్వహణకు మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
నోటిఫికేషన్ పేరుతో హడావుడి
ఎన్నికల వేళ 25 వేల టీచర్ పోస్టులని చెప్పినా.. 16,347 పోస్టులను మాత్రమే ప్రభుత్వం ప్రక టించింది. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకు న్న వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పి స్తామంటూ ఆగస్టులో టెట్ పరీక్షలు నిర్వహించేలా జూలై 2న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఆ గస్టులో పరీక్షలంటూ పేర్కొంది. ఇది చేయకపో గా మళ్లీ టెట్‌కు డీఎస్సీకి 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్‌ను తొలుత సెపె్టంబర్‌కు తర్వాత అక్టోబర్‌కు మార్చారు.
టెట్ ఫలితా లు వచ్చి రెండు నెలలు గడిచినా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం వెలవడలేదు. మరోపక్క ప్రకటించిన పోస్టుల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో (ఆశ్రమ్) దా దాపు 15 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వి ధానంలో పని చేస్తు న్న ఉపాధ్యాయులను తొలగించేందుకు కుట్ర ప న్నింది. వారికి డీఎస్సీలో ఎ లాంటి వెయిటేజీ ఇ వ్వకుండానే దాదాపు 1,150 ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీకి చూపించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది.
పైగా గత కొన్ని నెలలుగా ఈ విభాగం కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వారి దృష్టి మళ్లించేందుకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు పంపించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఆలస్యం చేయడానికేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment