హరిత తెలంగాణకు పాటుపడాలి
-
రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా
రఘునాథపల్లి : సామాజిక బాధ్యతగా అందరూ మొక్కలు నాటి హరిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వరంగల్ రూరల్ ఎస్సీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు.
హరితహారంలో బాగంగా బుధవారం మండల కేంద్రంలోని సేయింట్ మేరీ పాఠశాలలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్బంగా సర్పంచ్ ఎండీ సఫియాబేగం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారన్నారు. వరంగల్ రూరల్ పరిధిలో ప్రజలతో మమేకమై ఇప్పటికే 5 లక్షల మొక్కలు నాటామని చెప్పారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు నాటడమే ఏకైక మార్గమన్నారు. ఎమ్మెల్యే టి.రాజయ్య మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో జనగామ డీఎస్పీ పద్మనాభరెడ్డి, రూరల్ సీఐ తిరుపతి, ఎస్సై రంజిత్‌రావు, ట్రైనీ ఎస్సై సుధాకర్, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ శారద, వైస్ ఎంపీపీ మల్కాపురం లక్ష్మయ్య, ఫాదర్ చిన్నపురెడ్డి, ప్రిన్స్‌పాల్ ఆల్‌బర్ట్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
––––––––––––––––––––––
03ఎస్‌టిజి501 రఘునాథపల్లిలో మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న ఎస్పీ, ఎమ్మెల్యే