రూరల్ ఎస్పీకి మానవహక్కుల సంఘం నోటీసులు
Published Mon, Oct 3 2016 8:20 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
దుగ్గిరాల (గుంటూరు): ఆస్తి విషయమై కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదంతో దళితులను బలిగొన్న సంఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని కోరుతూ గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీకి మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన ఆళ్ళ సీతమ్మ కుటుంబంలో తలెత్తిన వివాదంలో ప్రమేయం లేని ఎస్సీలపై పాశవికంగా దాడి చేయడంతో ఇద్దరు దళితులు బలయ్యారు. ఈ ఘటనలో కుటుంబ యజమానులను కోల్పోయి దిక్కుతోచని దుస్థితిలో ఉన్న మతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కోరుతూ చిలువూరు గ్రామనికి చెందిన చిలువూరు నాగరాజు గత నెల 17న మానహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.స్పందించిన కమిషన్ ఈ ఘటనకు సంబందించి సమగ్ర నివేదికను నవంబర్ 28వ తేదీ లోగా అందజేయాలని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీకి నోటీసులు జారీ చేసినట్టు నాగరాజు తెలిపారు.
Advertisement
Advertisement