సాక్షి,హైదరాబాద్:బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో ఈ నెల 16న తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో ఈడీ కోరింది. నిజానికి కేటీఆర్ ఈడీ ఎదుట మంగళవారం(జనవరి 7)విచారణకు హాజరవ్వాల్సి ఉంది.
అయితే క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు వచ్చేందుకు సమయం కావాలని కేటీఆర్ ఈడీని కోరారు. దీంతో ఈడీ సమయమిచ్చింది. మరోవైపు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేయడంతో ఈడీ తాజాగా కేటీఆర్‌కు మళ్లీ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, గురువారం(జనవరి 9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ ఇప్పటికే నోటీసులిచ్చింది. అయితే తన క్వాష్ పిటిషన్ కొట్టి వేయడంపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళతారన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.కేటీఆర్ వేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
ఇదీ చదవండి: సుప్రీంకు ఫార్ములా ఈ కేసు పంచాయితీ
Comments
Please login to add a commentAdd a comment