నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం
-
కమాండ్ కంట్రోల్ అండ్ వాట్సప్ నంబర్ ఏర్పాటు
-
పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి
-
ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ
వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు వాట్సప్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ తెలిపారు. రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన వాట్సప్ నెంబర్‌ను అధికారికం గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో జరి గే అక్రమాలు, శాంతిభద్రతలకు భంగం కల్గించే ఘటనలను, ఆపద సమయంలో పోలీసుల స హాయం కోసం సమాచారం అందించేందుకు 85009 27777 నంబర్‌తో వాట్సప్‌కు సమాచా రం అందిస్తే వెంటనే పోలీసుల సహాయం అం దుతుందన్నారు. ఈ నంబర్‌తో వచ్చే సమాచా రం, ఫిర్యాదులను పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
24 గంటలు అందుబాటులో...
పోలీసులు ఎంత నిఘా పెట్టినా ప్రజల భాగస్వామ్యం లేకుంటే అక్రమాలను అరికట్టలేమన్నారు. ఈ వాట్సప్ నెంబర్‌కు రూరల్ పరిధిలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, ఇసుక అక్రమ రవాణా, గుట్కా, గుడుంబా తయారీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తే పోలీసు అధికారులు వెంటనే స్పందిస్తారని అన్నారు. వాట్సప్ కమాండ్ కంట్రోల్‌కు ఎస్‌ఐ ఇన్‌చార్జి నేతృత్వంలోని ముగ్గురు కానిస్టేబుళ్ల బృందం 24గంటల పాటు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. జిల్లాలోని ప్రజలు, యువత, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని నేరాల నియంత్రణలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు.
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
రూరల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్నlకేసుల పరిష్కారానికి వెంటనే చేపట్టాలని ఎస్సీ కిషోర్‌ఝూ పోలీసు అధికారులను ఆదేశించారు. అధికారులతో నేర సమీక్ష సమావేశంలో నిర్వహించారు. జిల్లాల విభజన నేపథ్యంలో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదేశించారు. ఈ సమావేశంలో ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి, డీపీవో ఏవో సత్యనారాయణరెడ్డి, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల డీఎస్సీలు పద్మనాభరెడ్డి, రాజమహేంద్రనాయక్, మురళీధర్, సుదీంధ్ర, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ బాలాజీ, వరంగల్ రూరల్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.