people share
-
నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం
కమాండ్ కంట్రోల్ అండ్ వాట్సప్ నంబర్ ఏర్పాటు పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు వాట్సప్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ తెలిపారు. రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన వాట్సప్ నెంబర్‌ను అధికారికం గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో జరి గే అక్రమాలు, శాంతిభద్రతలకు భంగం కల్గించే ఘటనలను, ఆపద సమయంలో పోలీసుల స హాయం కోసం సమాచారం అందించేందుకు 85009 27777 నంబర్‌తో వాట్సప్‌కు సమాచా రం అందిస్తే వెంటనే పోలీసుల సహాయం అం దుతుందన్నారు. ఈ నంబర్‌తో వచ్చే సమాచా రం, ఫిర్యాదులను పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24 గంటలు అందుబాటులో... పోలీసులు ఎంత నిఘా పెట్టినా ప్రజల భాగస్వామ్యం లేకుంటే అక్రమాలను అరికట్టలేమన్నారు. ఈ వాట్సప్ నెంబర్‌కు రూరల్ పరిధిలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, ఇసుక అక్రమ రవాణా, గుట్కా, గుడుంబా తయారీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేస్తే పోలీసు అధికారులు వెంటనే స్పందిస్తారని అన్నారు. వాట్సప్ కమాండ్ కంట్రోల్‌కు ఎస్ఐ ఇన్చార్జి నేతృత్వంలోని ముగ్గురు కానిస్టేబుళ్ల బృందం 24గంటల పాటు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. జిల్లాలోని ప్రజలు, యువత, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని నేరాల నియంత్రణలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలి రూరల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్నlకేసుల పరిష్కారానికి వెంటనే చేపట్టాలని ఎస్సీ కిషోర్‌ఝూ పోలీసు అధికారులను ఆదేశించారు. అధికారులతో నేర సమీక్ష సమావేశంలో నిర్వహించారు. జిల్లాల విభజన నేపథ్యంలో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదేశించారు. ఈ సమావేశంలో ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి, డీపీవో ఏవో సత్యనారాయణరెడ్డి, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల డీఎస్సీలు పద్మనాభరెడ్డి, రాజమహేంద్రనాయక్, మురళీధర్, సుదీంధ్ర, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బాలాజీ, వరంగల్ రూరల్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
గ్రామజ్యోతిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి
మంత్రి హరీశ్‌రావు పటాన్చెరు : గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన పటాన్చెరు మండలం లక్డారంలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామజ్యోతి కార్యక్రమం విశిష్టతను వివరించారు. కాగా మంత్రి గ్రామ ప్రజలను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. వేదికపై ఆయన నిలబడి ఉన్నంత సేపు గ్రామ ప్రజలను నవ్వించారు. గ్రామజ్యోతి విశిష్టతను సూటిగా అర్థమయ్యేలా వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన గంగదేవిపల్లి ఎలా ఆదర్శ గ్రామంగా మారిందో ఆ విధంగానే తెలంగాణలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామాభివృద్ధి ప్రణాళికలకు ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. అందుకోసమే ఏడు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. డంప్ యార్డుకు స్థలం కేటాయించండి అన్ని గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డు కోసం స్థలాన్ని వెంటనే కేటాయించాలని తహశీల్దార్లకు మంత్రి సూచించారు. లక్డారంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయించక పోవడంపై మంత్రి స్థానిక తహశీల్దార్ ఫర్హీన్ షేక్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. గ్రామజ్యోతి ప్రారంభించి మూడు రోజులైనా డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించక పోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గ్రామంలో అంగన్వాడీ, వైద్యం, ఆరోగ్యం పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రాంలో కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీశైలం యాదవ్, జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
3.52 కోట్ల మొక్కలు రెడీ
సర్వం సిద్ధం - ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి - నేడు మెదక్‌లో ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు - 4న సిద్దిపేటకు సీఎం కేసీఆర్ - కలెక్టర్ రాహుల్ బొజ్జా వెల్లడి సంగారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘హరితహారం’ జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. ఇందుకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏ కార్యక్రమమైనా జయప్రదమవుతుంద న్నారు. కలెక్టరేట్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వందలో మూడో వంతు చెట్లు వుంటాయని అన్నారు. చెట్లు విరివిగా వుంటే పర్యావరణ పరిరక్షణతో పాటు సకాలంలో వర్షాలు కురిసి ఆ దేశం సుభిక్షంగా వుంటుందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం 20 శాతం మాత్రమే పచ్చదనం వుందని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హరిత హారం కార్యక్రమాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. ఈనెల 4న సిద్దిపేట నియోజకవర్గంలో జరిగే హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ వరకు నిరంతరంగా కొనసాగుతుందన్నారు. ప్రతి గ్రామంలో 40 వేల నుంచి 50వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. 450 నర్సరీల్లో 250 అటవీ శాఖ, 200 డోమా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రైతులు పొలాల్లో టేకు, యూకలిప్టస్ మొక్కలు, రహదారుల వెంట పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పండ్ల మొక్కలను ఎంపిక చేశామన్నారు. జిల్లాలో దాదాపు 4.70లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు వున్నారని, ప్రతి ఇంటికి 5 నుంచి 10 మునగ, కరివేపాకు, మామిడి, సపోటా, అంజూర పండ్ల మొక్కలను పంపిణీ చేసి వాటిని నాటేందుకు కూడా చర్యలు తీసుకున్నామని అన్నారు. గృహాల్లో స్థలం లేని వారికి క్రీపర్లను సరఫరా చేయనున్నట్టు చెప్పారు. మిషన్ కాకతీయ కింద ఇప్పటివరకు 900 చెరువులను పునరుద్ధరించామని, వాటి కి చుట్టూ ఈత, ఖర్జూర మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. జిల్లాలోని పారశ్రామిక వాడల్లో పది లక్షల మొక్కలు నాటేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని, లక్ష ట్రీగార్డులను సమకూరుస్తున్నారని చెప్పారు. జిల్లాలో రిజర్వు ఫారెస్ట్ కేవలం పది శాతం వున్నందున రూట్స్టాక్ ఉన్న మొక్కలన్నింటినీ పురుద్ధరిస్తామని అన్నారు. పదివేల ఎకరాల్లో పెద్ద ఎత్తున ట్రెంచ్ కటింగ్ కూడా చేస్తున్నామన్నారు. ఫారెస్ట్ చుట్టూ రక్షణగా గచ్చకాయ మొక్కలను పెంచేందుకు ఇప్పటికే రెండు లక్షల మొక్కలను కూడా అందుబాటులో వుంచామని చెప్పారు. అనంతరం స్వచ్ఛ హరిత మెదక్ పేరిట రూపొందించిన లోగోను కలెక్టర్, జేసీ తదితరులు ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్ఓ దయానంద్, డీఎఫ్ఓ సుధాకర్‌రెడ్డి, జేడ్పీ సిఇఓ/డోమా పీడీ మధు, వాటర్ గ్రిడ్ ఎస్.ఇ.విజయప్రకాష్ పాల్గొన్నారు. వారానికి సరిపడా గుంతలు.. మొక్కలు నాటేందుకు తొమ్మిది లక్షల గుంతలను కూడా సిద్ధం చేశామని చెప్పారు. వారం రోజులతో పాటు సెప్టెంబర్ వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతున్న దృష్ట్యా గుంతలను తవ్వించి సిద్ధం చేస్తామని వివరించారు. బహిరంగ మల విసర్జన లేని స్వచ్ఛమైన జిల్లాగా మార్చడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. లక్ష మరుగుదొడ్లు నిర్మించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినట్లు తెలిపారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే జన్మభూమి
అర్హులందరికీ పింఛన్లు జన్మభూమి-మాఊరు ప్రారంభసభలో మంత్రి బొజ్జల ఎన్ఆర్ పేటలో ఎన్టీఆర్ సుజలస్రవంతి ప్రారంభం చిత్తూరు (టౌన్): ప్రజల భాగస్వామ్యంతోనే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర అటవీ, సహకారశాఖల మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి చిత్తూరులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని అక్కడే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ కార్యక్రమమూ విజయవంతం కాదన్నారు. అందుకే చంద్రబాబు వారిచేతనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా రూపకల్పన చేశారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పెంచిన పింఛన్లను అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారన్నారు. గతంలో ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని పెంచినట్టు వివరించారు. గతంలో పింఛన్ల మంజూరులో అవకతవకలు జరిగినట్టు తెలియడంతో వాటిపై సర్వేచేసి అనర్హులకు రద్దుచేశామన్నారు. అర్హులకు ఎక్కడైనా పింఛన్ రద్దయివుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిశీలించి మంజూరు చేస్తారన్నారు. జన్మభూమి స్పెషలాఫీసర్ ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలనే ముఖ్య సిద్ధాంతంతో మాఊరు కార్యక్రమాన్ని సీఎం ప్రవేశపెట్టారన్నారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మాట్లాడుతూ గ్రామాలను బాగుచేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మాఊరు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి తీర్చడం కోసం ప్రభుత్వం సూక్ష్మప్రణాళికను అమలు చేస్తోందన్నారు. అందరూ విజన్ మోడ్‌తో పనిచేసిన నాడే అది సాధ్యమన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గాంధీ జయంతి రోజు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు నాయుడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజాసమస్యలను తెలుసుకోగలిగారన్నారు. వాటి పరిష్కారం కోసమే నేడు జన్మభూమి కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. అంతకుముందు జన్మభూమి ర్యాలీని మంత్రి ప్రారంభించారు. జెడ్పీ చైర్పర్సన్ శ్రీరామనేని గీర్వాణి, మేయర్ కటారి అనురాధ, జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తా, ఏజెసీ వెంకటసుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు, జెడ్పీ సీఈవో వేణుగోపాలరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ శివకుమార్, వ్యవసాయశాఖ జేడీ రవికుమార్, పశుసంవర్థకశాఖ జేడీ శ్రీనివాసరావు, ఎసీడీఎస్ పీడీ ఉషాఫణికర్,డీఎంఅండ్‌హెచ్‌వో దశరథరామయ్య, డీసీహెచ్ఎస్ కనకదుర్గ, డ్వామా పీడీ గోపీచంద్, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, డీఈవో ప్రతాప్‌రెడ్డి, ఎస్ఎస్ఏ పీవో లక్ష్మి, డీపీవో ప్రభాకర్‌రావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ధనుంజయరావు, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ రాజేంద్రప్రసాద్, చిత్తూరు ఆర్డీవో పెంచల కిశోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిత్తూరు రూరల్ మండలంలోని ఎన్ఆర్ పేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకాన్ని మంత్రి ప్రారంభించారు.