న్యూఢిల్లీ: సిగరెట్ల ఉత్పత్తి నిలిపివేత నిర్ణయం తమ కంపెనీపై ఆర్థికంగా ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోదని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వీఎస్‌టీ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ప్యాకెట్లపై (డిస్‌ప్లే ప్లేస్) 85 శాతంమేర ఆరోగ్య భద్రతను సూచిస్తూ... సంబంధించిన హెచ్చరిక చిత్రాన్ని ముద్రించాలని కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల్లో అస్పష్టత ఉందని, ఈ తరహా అస్పష్టత తొలగేంతవరకూ ఏప్రిల్ 1వ తేదీ నుంచీ సిగరెట్ల ఉత్పత్తిని నిలిపివేయాలని టొబాకో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (టీఐఐ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. చామ్స్, చార్మినార్, గోల్డ్, మూమెంట్స్ బ్రాండ్స్ కింద వీఎస్‌టీ సిగరెట్లను ఉత్పత్తి చేస్తోంది.