VST Industries
-
HYD: చిక్కడపల్లి సమీపంలో అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వీఎస్టీలోని ఓ గోదాంలో గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కాగా, గోదాంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్ని ప్రమాద ఘటన సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వీఎస్టీ ఇండస్ట్రీస్- కేపీఐటీ.. అదుర్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో పొగాకు ఉత్పత్తుల దిగ్గజం వీఎస్టీ ఇండస్ట్రీస్, ఐటీ సేవల కంపెనీ కేపీఐటీ టెక్నాలజీస్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్‌ల అమలు కాలంలోనూ ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. వీఎస్టీ ఇండస్ట్రీస్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో వీఎస్టీ ఇండస్ట్రీస్ నామమాత్ర వృద్ధితో దాదాపు రూ. 76 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు మాత్రం 19 శాతం క్షీణించి రూ. 245 కోట్లకు పరిమితమయ్యాయి. లాక్‌డవున్ నేపథ్యంలో సప్లై చైన్ అవాంతరాలు, వినియోగ డిమాండ్ నీరసించడం వంటి అంశాలు పనితీరును ప్రభావితం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం తయారీ కార్యకలాపాలు ఊపందుకున్నప్పటికీ అమ్మకాలపై కోవిడ్-19 ప్రభావం ఉండవచ్చని భావిస్తోంది. కాగా.. ఎన్ఎస్ఈలో తొలుత వీఎస్టీ ఇండస్ట్రీస్ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 3,650కు చేరింది. ప్రస్తుతం 8.2 శాతం జంప్‌చేసి రూ. 3,500 వద్ద ట్రేడవుతోంది. కేపీఐటీ టెక్నాలజీస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కేపీఐటీ టెక్నాలజీస్ నికర లాభం 36 శాతంపైగా క్షీణించింది. రూ. 24 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం వెనకడుగుతో రూ. 493 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 1.2 శాతం తక్కువగా 13.4 శాతంగా నమోదయ్యాయి. కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 432 కోట్లను తాకినట్లు కేపీఐటీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేపీఐటీ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 68 సమీపంలో ఫ్రీజయ్యింది. -
వీఎస్టీ లాభం రూ. 49 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వీఎస్టీ ఇండస్ట్రీస్ రూ. 270 కోట్ల ఆదాయంపై నికర లాభం రూ. 49 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 883 కోట్ల కాగా లాభం రూ. 153 కోట్లు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 836 కోట్లు కాగా లాభం రూ. 152 కోట్లు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 70 డివిడెండు ఇవ్వాలని బోర్డు సిఫార్సు చేసింది. -
ఉత్పత్తి నిలిపివేత ‘ఆర్థికం’పై ప్రభావం చూపదు: వీఎస్టీ
న్యూఢిల్లీ: సిగరెట్ల ఉత్పత్తి నిలిపివేత నిర్ణయం తమ కంపెనీపై ఆర్థికంగా ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోదని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వీఎస్టీ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ప్యాకెట్లపై (డిస్ప్లే ప్లేస్) 85 శాతంమేర ఆరోగ్య భద్రతను సూచిస్తూ... సంబంధించిన హెచ్చరిక చిత్రాన్ని ముద్రించాలని కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల్లో అస్పష్టత ఉందని, ఈ తరహా అస్పష్టత తొలగేంతవరకూ ఏప్రిల్ 1వ తేదీ నుంచీ సిగరెట్ల ఉత్పత్తిని నిలిపివేయాలని టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (టీఐఐ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. చామ్స్, చార్మినార్, గోల్డ్, మూమెంట్స్ బ్రాండ్స్ కింద వీఎస్టీ సిగరెట్లను ఉత్పత్తి చేస్తోంది. -
వీఎస్టీ డివిడెండ్... రూ.70
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెం దిన వీఎస్టీ ఇండస్ట్రీస్ 2013-14 ఆర్థిక సంవత్సరానికి షేరుకు రూ.70 డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ రికార్డు తేదీని ఆగస్టు 25గా నిర్ణయించగా, దీనికి ఆగస్టు 12న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం ఆమోదం తెలపాల్సి ఉంది. గతేడాది వీఎస్టీ రూ.62.5 డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో వీఎస్టీ రూ.377 కోట్ల ఆదాయంపై రూ.52 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2013-14 పూర్తి ఏడాదికి రూ.1,627 కోట్ల ఆదాయంపై రూ.150 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. మంగళవారం బీఎస్ఈలో ఈ షేరు .15శాతం పెరిగి రూ.1,780 వద్ద ముగిసింది.