మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..! | Every Woman Should Know About These 10 Safety Apps | Sakshi
Sakshi News home page

మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!

Published Tue, Dec 26 2023 11:31 AM | Last Updated on Tue, Dec 26 2023 11:46 AM

Every Woman Should Know About These 10 Safety Apps  - Sakshi

ప్రస్తుతం జీవన విధానంలో మహిళలు బయటకు వెళ్లి సంపాదించాల్సిన పరిస్థితి. పెరుగుతున్న ధరలు, పిల్లల ఉన్నత చదువులని ఇలా రకరకాలుగా ఖర్చులు పెరగడంతో ఒక్కరి సంపాదనతో ఇంటిల్లపాదిని పోషించడం ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. అందువల్ల మగువలు కూడా కష్టపడక తప్పని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని పరిస్థితుల్లో చిక్కుల్లో పడటమో! లేదా కొందరీ ఆకతాయిల వల్ల విపత్కర పరిస్థితులు ఎదుర్కొనవలసి రావొచ్చు. లేదా కంపెనీ నిమిత్తం లేదా మరే కారణాలవల్ల కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సిన రావొచ్చు అక్కడ ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితి రావొచ్చు.

అలాంటి వాటిని చాలా సునాయసంగా హ్యాండిల్‌  చేసుకుని మిమ్మల్ని భద్రంగా ఉంచుకునేందుకు ప్రతి మహిళ ఈ భద్రతా యాప్‌ల గురించి అవగాహన పెంచుకోవాలి, తప్పక తెలుసుకోవాల్సినవి కూడా. వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన యాప్‌లే. ఈ యాప్‌లు తెలుసుకున్నా లేదా వాటిలో కనీసం రెండు లేదా ఒక్క యాప్‌ని మీ ముబైల్‌ డౌనలౌడ్‌ చేసుకున్నా చాలు!. ప్రంపంచమంతా ధైర్యంగా చుట్టి వచ్చేయగలుగుతారు. ఎలాంటి పరిస్థితినైనా సునాయాసంగా హ్యాండిల్‌ చేయగలుగుతారు. 

మహిళలు తెలుసుకోవాల్సిన యాప్‌లు..
బీసేఫ్‌: ఇందులో రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్‌లు ఉంటాయి. అలాగే ఇబ్బుందుల్లోకి నెట్టే ఫేక్‌కాల్‌ నుంచి బయటపడేసే రకరకాల ఫీచర్‌లు కూడా ఇందులో ఉన్నాయి. పైగా ఇది చాలా ప్రసిద్ధ యాప్‌.

సర్కిల్‌ ఆఫ్‌ 6: అత్యవసర పరిస్థితుల్లో త్వరగా సంప్రదించగలిగేలా సుమారు ఆరుగురు విశ్వసనీయ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సర్కిల్‌ను ఏర్పరిచేందుకు అనుమతిస్తుంది.

సేఫ్టిపిన్: నగరంలో సురక్షితమైన, అసురక్షిత ప్రదేశాల గురించి సమాచారాన్ని అందించే క్రౌడ్-సోర్స్ యాప్. ఇది నగరంలోని వివిధ ప్రాంతాల గురించి సరైన సమాచారం ఇవ్వడం తోపాటు ట్రాకింగ్‌ చేసి అత్యవసర హచ్చరికలు జారీ చేయడమే గాక వాటికి భద్రతా రేటింగ్‌ని కూడా ఇస్తుంది. 

విత్‌యూ(VithU): జస్ట్‌ రెండు ట్యాప్‌లతో వారి కాంటాక్ట్స్‌లో ఉన్న నెంబర్స్‌కి సాస్‌(SOSష్త్ర సందేశాన్ని పంపేందుకు అనుమతిస్తుంది. పరిస్థితికి సంబంధించిన సాక్ష్యాలను సంగ్రహించడానికి ఆడియో లేదా వీడియోలను రికార్డ్ చేసే ఫీచర్‌ కూడా ఉంటుంది.

మై సేఫ్టీపాల్‌: మహిళలు ఉన్న ప్రదేశానికి సంబంధించిన వివరాలు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో షేర్‌ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది వివిధ లొకేషన్‌లలో అత్యవసర హెచ్చరికలు, పానిక్ బటన్, సేఫ్టీ స్కోర్‌ల వంటి ఫీచర్‌లను అందిస్తుంది.

షేక్2సేఫ్టీ: ముందుగా సేవ్ చేసిన కాంటాక్స్‌ నెంబర్స్‌కి అత్యవసర సందేశాన్ని పంపడానికి మహిళలు తమ ఫోన్‌ను షేక్ చేయడానికి అనుమతించే సులభమైన యాప్.

సాస్‌ స్టే సేఫ్: జస్ట్‌ ఒక ట్యాప్‌తో సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి  సాస్‌(SOS) సందేశాన్ని పంపడానికి మహిళలకు అనుమతిస్తుంది. యాప్‌లో లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలారం ఫీచర్‌ను కూడా అందిస్తుంది.

ఫైట్‌బ్యాక్: ఇది స్వీయ-రక్షణ యాప్. దీనిలో  స్వీయ-రక్షణ ట్యుటోరియల్‌లు తోపాటు భద్రతా సలహాలను అందిస్తుంది. మహిళలు తాము ఎక్కడున్నారో వారి కుటుంబికులు లేదా స్నేహితులకు తెలియజేసేలా సాస్‌(SOS) సందేశాన్ని పంపడానికి అనుమతిస్తుంది.

లైఫ్‌ 306: కుటుంబ భద్రత యాప్. ఇది మహిళలు తమ కుటుంబ సభ్యులతో ప్రైవేట్ నెట్‌వర్క్‌ని సృష్టించడానికి అనుమతిస్తుంది. ఇది రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్‌లు, ఆటోమేటిక్ క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్‌లను అందిస్తుంది.

నిర్భయం: భారతదేశంలోని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. యాప్ రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్‌లు తోపాటు వన్-టచ్ పానిక్ బటన్‌ను అందిస్తుంది.

ఈ యాప్‌లు చాలా వరకు మహిళలను తమను తాము సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. స్మార్ట్‌ ఫోన్‌ల పుణ్యమా అని వస్తున్న ఈ భద్రతా యాప్‌లను ఉపయోగించుకుని స్వీయ సంరక్షణ పొందండి. దీంతో పాటు కొన్ని విపత్కర పరిస్థితుల్లో అలాంటి యాప్‌లను కూడా వినయోగించలేని పరిస్థితి ఏర్పడొచ్చు అలాంటప్పడు ఈ కింది చిట్కాలు ఫాలోకండి.

అవేంటంటే..

  • మీరు వెళ్లే  పరిసరాల గురించి తెలుసుకోండి. ఎక్కడ ఉన్నా అప్రమత్తంగా ఉండండి. అది అర్థరాత్రి అయిన లేదా మరే సమయం అయినా జనసంచారం లేని రోడ్డుపై వెళ్తుంటే బహు అప్రమత్తంగా ఉండండి. కనీసం ప్రముఖ రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న నిర్లక్ష్యం వహించొద్దు. చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి.
  • మీరు ఉన్న ప్రదేశంలో అసౌకర్యంగా అనిపించినా లేదా ఏదో తప్పు జరుగుతుంది లేదా తప్పు జరగబోతోందని అనిపిస్తే.. వీలైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయి సురక్షితంగా ఉండేలా చూసుకోండి
  • స్వీయ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే వంటి సురక్షిత సాధనాలను కూడా మీ వద్ద ఉంచుకోండి. 
  • పరిస్థితి చేజారుతుందనుకున్నప్పుడూ మిమ్మల్ని మీరు రక్షించుకునేలా స్వీయ రక్షణ చర్యలను నేర్చుకోండి(అవతలి వ్యక్తిపై తిరగబడటం లేదా భయపడలే చేయడం వంటి పనులు)
  • తెలియని కొత్త ప్రదేశానికి వెళ్తుంటే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వండి. మీ ఆచూకిని వారికి క్లియర్‌గా చెప్పండి. ఎప్పటికప్పుడూ మీ గురించి అప్‌డేట్‌ ఇన్‌ఫర్మేషన్‌ని తప్పక ఇవ్వండి. 

ఇప్పుడు చెప్పిన యాప్‌లు, ఈ చిట్కాలు ఫాలో అయితే ప్రతి మహిళకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సురక్షితంగా ఉండగలిగాలే హ్యాండిల్‌ చేసుకునే ధైర్యం ఆటోమెటిక్‌గా వస్తుంది. బీ కేర్‌ ఫుల్‌.

(చదవండి:  మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement