బస్సు ఎక్కి భద్రతా తెలుసుకుని
జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సోమవారం మధ్యాహ్నం సల్కాపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించినంతరం అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో కర్నూలులోని రిలయన్స్ మార్టు వరకు ప్రయాణించారు. మార్గమధ్యలో ప్రయాణికులతో మాట్లాడి ఆదోని, కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లోని శాంతిభద్రతల వివరాలు, పోలీసుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేడియో స్టేషన్‌కు ఎదురుగా ఉన్న రిలయన్స్ మార్టులోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రమణమూర్తి ఉన్నారు.