దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు టెండర్లపై అధికారంలో ఉన్న మిత్రపక్షాల నేతల మధ్య ఏర్పడిన పోటీ తారస్థారుుకి చేరింది.
దుర్గగుడి సెక్యూరిటీ టెండర్‌పై వివాదం
మిత్రపక్షాల్లో రాజుకున్న చిచ్చు
మా సంస్థ అంటే మాసంస్థ అంటూ పట్టు
చేతులెత్తేసిన దేవస్థానం అధికారులు
చివరికి టెండర్లు రద్దు
విజయవాడ : దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు టెండర్లపై అధికారంలో ఉన్న మిత్రపక్షాల నేతల మధ్య ఏర్పడిన పోటీ తారస్థారుుకి చేరింది. దీంతో చివరకు టెండర్లు రద్దయ్యే వరకు చేరింది. వివరాల్లోకి వెళితే.. దుర్గగుడి భద్రత కోసం ప్రరుువేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తారు. కొన్నేళ్లుగా ఓపీడీఎస్ అనే సంస్థ ఇక్కడ సెక్యురిటీ బాధ్యతలు నిర్వహిస్తోంది. గత డిసెంబర్‌తో ఈ సంస్థ గడువు ముగియడంతో దేవస్థానం అధికారులు ఏడాది కాలానికి తిరిగి టెండర్లు పిలిచారు. సుమారు 11 సంస్థలు టెండర్లు దరఖాస్తులు కొనుగోలు చేయగా, నాలుగు సంస్థలు పోటీపడ్డారుు. ఇందులో ఓపీడీఎస్‌తో పాటు ఎంజిల్ అనే సంస్థ కూడా చివర వరకు వచ్చింది. దీంతో ఈ రెండు సంస్థల మధ్య పోటీ పెరిగింది.
అధికార పార్టీ సిఫారసు
ఎంజెల్స్ సంస్థకు టెండర్ ఖరారు చేయాలంటూ నగరానికి చెందిన కొంతమంది బీజేపీ నేతలు దేవస్థానం అధికారులకు సిఫారసు చేశారు. ఇప్పటికే ఉన్న ఓపీడీఎస్ సంస్థకు తిరిగి టెండర్ అప్పగించాలంటూ టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బీజేపీకి చెందినవారు కావడం, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర టీడీపీకి చెందినవారు కావడంతో ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక దుర్గగుడి అధికారులు నానా హైరానా పడ్డారు. చివరకు రెండు సంస్థల గురించి వాకబు చేశారు. ఎంజెల్ సంస్థకు విజయవాడలో కార్యాలయం లేదని, కేవలం కార్యాలయం ఏర్పాటుచేసిన బోర్డు మాత్రమే ఉంది తప్ప సిబ్బంది లేరని అధికారుల సర్వే లో తేలింది. దీంతో టెండర్‌పై ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని అధికారులు ఇదే విషయాన్ని కమిషనర్‌కు తెలియజేశారు.
టెండర్ రద్దు
అధికార ంలో ఉన్న మిత్రపక్షాల మధ్యే పోటీ ఏర్పడటం, రెండు పార్టీల నేతలు దీన్ని కీలకంగా భావించడంతో దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ టెండర్‌ను రద్దుచేసి తిరిగి ఆక్షన్ నిర్వహించాలని దేవస్థానం అధికారుల్ని ఆదేశించినట్లు సమాచారం. కొత్త టెండర్ పిలిచే వరకు నిబంధనల ప్రకారం పాత కాంట్రాక్టర్‌ను కొనసాగించాలనే ఆలోచన చేస్తున్నారు.