
న్యూఢిల్లీ: యూజర్ల సమాచార గోప్యత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం అధునాతన ఫీచర్ల పెంపు విషయంలో అత్యుత్తమ ప్రైవసీ సెట్టింగులను ఏకంగా రెట్టింపు చేసినట్లు వివరించింది. ఈ అంశంపై సంస్థ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ కీత్ ఎన్‌రైట్ మాట్లాడుతూ.. ‘డేటా వినియోగంపై యూజర్లకు మాత్రమే పూర్తి అధికారం ఉండేలా ఫీచర్లను పెంపొందించాం. భద్రత పెంపు కోసం భారీ మొత్తంలో పెట్టుబడిపెట్టాం’ అని వివరించారు. క్రోమ్‌లో మరిన్ని మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.