
బ్యాక్‌సీట్ మా ఆవిడదే: అల్లు అర్జున్
అలాగే సినిమాలో హీరోయిన్లను ఎక్కించుకుని డ్రైవ్ చేసినా... బయట మాత్రం బ్యాక్‌సీట్ మా ఆవిడదే..
హైదరాబాద్: ‘‘బైక్ ఉండడం తప్పు కాదు. వేగంగా వెళ్లాలనే సరదా కూడా ఉండొచ్చు. కానీ వీటిన్నంటికన్నా ప్రాణం విలువైనది. అందుకే భధ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. హెల్మెట్ ధరించండి. దీని వల్ల ప్రమాదాల్లో మరణాల శాతం చాలా వరకూ తగ్గించవచ్చు’’ అంటూ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ యువతకు పిలుపునిచ్చాడు. నగరంలోని తాజ్ కష్ణా హోటల్‌లో నిర్వహించిన ‘హీరో’ కొత్త బైక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ యంగ్ స్టైలిష్ స్టార్... ఈ సందర్భంగా తన వ్యక్తిగత బైక్ డ్రై వింగ్ అనుభవాలను పంచుకున్నాడు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
నాన్న బైక్ కొనివ్వలేదు...
నాకు చిన్నతనంలో పెద్దగా బైక్ నడిపిన అనుభవం లేదు. చాలా సార్లు అడిగినా మా నాన్న కొనివ్వలేదు. పద్దెనిమిదేళ్ల వయసు దాటిన తర్వాత నుంచీ కారు వాడుతున్నాను. దాంతో బైక్ వాడే అవసరం రాలేదు. నేను మొదట బైక్ నేర్చుకుని నడిపింది బన్నీ సినిమాలో. హ్యాపీ సినిమాలో బైక్‌తో స్టంట్స్ చేసే సీన్స్ కూడా ఉన్నాయి. ఆ సినిమా వల్లే బైక్ డ్రై వింగ్ బాగా వచ్చేసింది.
అక్కడి నుంచి దాదాపు ప్రతి సినిమాలో బైక్ డ్రై వింగ్ చేశా. అయితే విశేషం ఏమంటే... సినిమాలో తప్ప బయట ఎప్పుడూ డ్రైవ్ చేయలేదు. అలాగే సినిమాలో హీరోయిన్లను ఎక్కించుకుని డ్రైవ్ చేసినా... బయట మాత్రం బ్యాక్‌సీట్ మా ఆవిడదే... (నవ్వులు). ఈ మధ్యే విదేశాల్లోని రోడ్ల మీద డ్రై వ్ చేశా. అపుడప్పుడు సరదాకి నా ఫామ్ హౌజ్ దగ్గర ఉన్న రోడ్ మీద డ్రై వ్ చేయడం నాకిష్టం.
ప్రమాదం మన చేతుల్లో లేదు...కాని భధ్రత మన చేతుల్లోనే...
వాహనం వినియోగించేటప్పుడు ప్రమాదాలు జరగవచ్చు. అది ఆపడం మన చేతుల్లో లేదు. అయితే భధ్రత మాత్రం మన చేతుల్లోనే ఉంది. రేసింగ్‌లు మంచిది కాదు. అలాగే హెల్మెట్ వినియోగం చాలా అవసరం. హెడ్‌ని కవర్ చేసుకోవడం వల్ల చాలా సందర్భాల్లో ప్రమాదాలు మరణానికి దారి తీయకుండా చేయవచ్చు. స్పీడ్‌గా వెళ్లొద్దని నేను చెప్పిన మాట వింటారో లేదో నాకు తెలీదు కానీ హెల్మెట్ వాడమనే సూచనను తప్పకుండా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.