ఆ నగరంలో కాలుష్యం బాగా తగ్గింది
Published Thu, Jul 20 2017 3:44 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
విశాఖపట్నం: విశాఖ నగరంలో గతంలో కంటే కాలుష్యం బాగా తగ్గిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..విశాఖలో పారిశ్రామిక అభివృద్ధి బాగా జరుగుతోందని తెలిపారు. ప్రశాంత వాతావరణం ఉన్న విశాఖను ఇండస్ట్రీ హబ్‌గా తయారుచేసి తీరుతామన్నారు. భద్రత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై కార్యాచరణ జరుగుతున్నట్లు వెల్లడించారు. భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Advertisement
Advertisement