టయోటా ప్లాంట్‌ల లాకౌట్
ముంబై: టయోటా మోటార్ కంపెనీ బెంగళూరు సమీపంలోని బిదాడిలో ఉన్న రెండు కార్ల తయారీ ప్లాంట్లలో ఆదివారం లాకౌట్ ప్రకటించింది. వేతనాల విషయమై కార్మికులతో జరిపిన చర్చలు విఫ లం కావడంతో లాకౌట్ ప్రకటించామని కంపెనీ వివరించింది. వేతనాల విషయమై గత 10 నెలలుగా కార్మికులతో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ఇరు పక్షాల మధ్య చర్చలు విఫలమవుతుండటంతో కర్నాటక లేబర్ డిపార్ట్‌మెంట్ కూడా రంగంలోకి దిగిందని, ఏడుసార్లు త్రైమాసిక సమావేశాలు జరిగాయని, కానీ అన్నీ విఫలమయ్యాయని తెలిపింది.
గత 25 రోజులుగా ఈ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని, ఒక వర్గం కార్మికులు కావాలనే ఉత్పత్తికి విఘాతం కలి గిస్తున్నారని పేర్కొంది. దీంతో ఇతర కార్మికులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకొని లాకౌట్ ప్రకటిస్తున్నామని వివరించింది. ఈ 2 ప్లాంట్లలో కలిపి 6,400 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఈ ప్లాంట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 3,10,000 యూనిట్లు.