Sports Utility
-
బెంట్లీ తొలి ఎస్యూవీ ‘బెంటేగ’
ధర రూ.3.85 కోట్లు న్యూఢిల్లీ: అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బెంట్లీ తాజాగా తన తొలి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ‘బెంటేగ’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3.85 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఎక్స్‌క్లూజివ్ మోటార్స్.. బెంట్లీ కంపెనీకి భారత్‌లోని డీలర్‌గా వ్యవహరిస్తోంది. ‘ఇప్పటికే బెంటేగ బుకింగ్స్‌ను తీసుకున్నాం. తొలి డెలివరీ 2 వారాల్లో జరుగుతుందని’ ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బంగ్లా తెలిపారు. వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన 5-6 నెలల కాలంలో కారును డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. ఎస్యూవీ ప్రత్యేకతలు: ‘బెంటేగ’లో ట్విన్ టర్బో చార్జ్డ్ 6 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్, 8 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్, వాయిస్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నావిగేషన్ వ్యవస్థ వంటి తదితర ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో ఇదే అత్యంత వేగవంతమైన లగ్జరీ ఎస్యూవీ అని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ గంటకు 301 కిలోమీటర్లు. హైదరాబాద్‌లో కొత్త షోరూమ్ హైదరాబాద్‌లో కొత్తగా బెంట్లీ షోరూమ్‌ను నిర్మిస్తున్నామని బంగ్లా తెలిపారు. దీన్ని రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. ఈ షోరూమ్‌లో సర్వీస్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు. -
మారుతి ఎస్యూవీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా వచ్చే ఏడాది స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. 2012 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కాన్సెప్ట్ కారు ఎక్స్ఏ ఆల్ఫా ఆధారంగా ఇది రూపుదిద్దుకుంటోందని సమాచారం. కాన్సెప్ట్ కారు పొడవు 4 మీటర్లు, వెడల్పు 1.9 మీటర్లు, ఎత్తు 1.6 మీటర్లు ఉంది. ఇటువంటి చిన్న ఎస్‌యూవీని వితారా పేరుతో వచ్చే ఏడాది యూరప్‌లో విడుదల చేసేందుకు సుజుకి మోటార్ సమాయత్తమవుతోంది. అయితే భారత్‌లో విడుదలయ్యే ఎస్యూవీ, వితారా ఒకటేనా అన్నదానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కారు కంటే ముందుగా క్రాస్ఓవర్ మోడల్ అయిన ఎస్ఎక్స్4 ఎస్ క్రాస్‌ను 2015 జూన్ ప్రాంతంలో భారత మార్కెట్లోకి తీసుకు రానుంది. కాగా, ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీకి దేశంలో డిమాండ్ పెరుగుతోంది. రాబోయే అన్ని మోడళ్లను ఈ టెక్నాలజీతో తీసుకురానున్నట్టు మారుతి సుజుకి తెలిపింది. కొత్త ప్రమాణాలతో... నూతన భద్రత ప్రమాణాలు 2017లో భారత్‌లో అమలయ్యే అవకాశం ఉందని మారుతి సుజుకి ఇండియా ఇంజనీరింగ్ విభాగం ఈడీ సి.వి.రామన్ తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో ఆల్టో కె10ను ఆవిష్కరించిన అనంతరం రీజినల్ మేనేజర్ మునీష్ బాలితో కలసి మీడియాతో మాట్లాడారు. నూతన ప్రమాణాలు అమలైతే కార్ల ఖరీదు కనీసం రూ.15 వేలు అధికమవుతుందని ఆయన చెప్పారు. చిన్న కారును కొనేవారికి ఇది భారమేనని పేర్కొన్నారు. ప్రమాణాలకు తగ్గట్టుగా తమ కంపెనీ ఏర్పాట్లు చేసుకుంటోందని వివరించారు. గ్లోబల్ ఎన్సీఏపీ భద్రత పరీక్షల్లో స్విఫ్ట్ కారు విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై రామన్ స్పందిస్తూ భారత్‌తోపాటు తాము వ్యాపారం చేస్తున్న దేశాలకు అనుగుణంగా కార్ల భద్రత ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. ఎన్సీఏపీ నివేదిక స్విఫ్ట్ కార్ల అమ్మకాలపై ఎటువంటి ప్రభావం చూపబోదని రామన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
టయోటా ప్లాంట్ల లాకౌట్
ముంబై: టయోటా మోటార్ కంపెనీ బెంగళూరు సమీపంలోని బిదాడిలో ఉన్న రెండు కార్ల తయారీ ప్లాంట్లలో ఆదివారం లాకౌట్ ప్రకటించింది. వేతనాల విషయమై కార్మికులతో జరిపిన చర్చలు విఫ లం కావడంతో లాకౌట్ ప్రకటించామని కంపెనీ వివరించింది. వేతనాల విషయమై గత 10 నెలలుగా కార్మికులతో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ఇరు పక్షాల మధ్య చర్చలు విఫలమవుతుండటంతో కర్నాటక లేబర్ డిపార్ట్మెంట్ కూడా రంగంలోకి దిగిందని, ఏడుసార్లు త్రైమాసిక సమావేశాలు జరిగాయని, కానీ అన్నీ విఫలమయ్యాయని తెలిపింది. గత 25 రోజులుగా ఈ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని, ఒక వర్గం కార్మికులు కావాలనే ఉత్పత్తికి విఘాతం కలి గిస్తున్నారని పేర్కొంది. దీంతో ఇతర కార్మికులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకొని లాకౌట్ ప్రకటిస్తున్నామని వివరించింది. ఈ 2 ప్లాంట్లలో కలిపి 6,400 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఈ ప్లాంట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 3,10,000 యూనిట్లు.