భద్రతను మెరుగుపర్చే లక్ష్యంగా, రోడ్డుప్రమాదాలను తప్పించడానికి జపాన్ ప్రముఖ కార్ల తయారీసంస్థ టయోటా మోటార్ కార్పొరేషన్ నడుం బిగించింది. వచ్చే ఐదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత డ్రైవింగ్ సిస్టమ్ ను అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొంది. దీనికోసం టయోటా రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను ఇటీవలే స్థాపించామని టయోటా సీఈవో గిల్ ప్రాట్ తెలిపారు. ఈ ఇన్ స్టిట్యూట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేసి, కార్ల భద్రతను మెరుగుపరుస్తుందని, రోడ్డు ప్రమాదాలని నివారిస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో కొత్త పురోగతితో వినియోగదారుల ముందుకు వస్తామని గిల్ ప్రాట్ తెలిపారు. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అభివృద్ధిలో పోటీ తీవ్రతరమౌతున్న నేపథ్యంలో 10 కోట్ల డాలర్లను ఈ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కు ఖర్చుచేయనున్నట్టు ప్రకటించారు.
2020 టోక్యో ఒలంపిక్స్ లోపల హైవేలపై ఆటోమేటిక్ గా నడిచే టయోటా కార్లను ఉత్పత్తి చేసేందుకు ఈ కంపెనీ ఎక్కువగా ప్రయత్నిస్తోంది. ఈ నెల మొదట్లోనే టయోటా ప్రత్యర్థి హోండా మోటార్ కార్పొరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేయడానికి కొత్త రీసెర్చ్ బాడీని స్థాపిస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇతర గ్లోబల్ ఆటోమేకర్స్ ఫోక్స్ వాగన్, ఫోర్డ్ లతో జతకట్టి రోబోటిక్స్ రీసెర్చ్ లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొంది. ఆటోమేటెడ్ వాహనాలను అభివృద్ధి చేయడంలో టెక్నాలజీ కంపెనీలతో జపాన్ ఆటోమేకర్లు పోటీ పడుతున్నాయి. భవిష్యత్తులో ప్రైవేట్ వాహన యాజమాన్యం డిమాండ్ రిస్క్ లో ఉన్న క్రమంలో దీనిపై కార్ల కంపెనీలు ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డ్రైవింగ్ సిస్టమ్..!
Published Mon, Jun 20 2016 3:02 PM | Last Updated on Mon, Aug 20 2018 4:52 PM
Advertisement
Advertisement