నూజివీడు: టయోటా వాహనంలో మంటలు చెలరేగి కొన్ని నిమిషాల్లోనే వాహనం దగ్ధమైంది. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మైలవరం ఫారెస్ట్ అధికారి, అతడి సోదరుడు టయోటా వాహనంలో పనిమీద వెళ్తున్నారు.
ఇంతలో వారు ప్రయాణిస్తున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కొన్ని నిమిషాల్లో టయోటా దగ్ధం అయింది. అయితే మంటలు చెలరేగిన వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి వారు అందులోంచి దిగేయడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇంజన్లో సమస్య రావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చునని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.