
సాక్షి, ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) వివిధ మోడళ్ల కార్ల ధరలను పెంచనున్నట్టు వెల్లడించింది. ఇన్పుట్ ఖర్చులు బాగా పెరగడంతో వాహనాల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం ప్రకటించింది. వచ్చే నెల (ఏప్రిల్) నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఉత్పత్తి ఖర్చుల తగ్గింపులో భాగంగా ధరల్లో మార్పులు చేస్తున్నట్టు టయోటా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా చెప్పారు. అయితే తమ విశ్వసనీయ వినియోగదారులపై చాలా తక్కువ భారాన్ని మాత్రమే వేస్తున్నామని , అలాగే ఉత్తమమైన ఉత్పత్తులను అందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అయితే ఏ మోడళ్లపై ధరలను పెంచుతున్నదీ కంపెనీ స్పష్టం చేయలేదు.