భారత్‌లో లాంచ్ చేయడానికి కంటే ముందే హైలక్స్ ట్రక్ బుకింగ్‌ను నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించుకుంది. ఈ మేరకు జపనీస్ ఆటోమేకర్ టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
మోస్ట్ అవెయిటింగ్ మోడల్‌గా ఉన్న ‘హైలక్స్’ కోసం కిందటి నెలలోనే బుకింగ్స్‌ను ప్రారంభించింది. మార్చ్‌లో లాంఛింగ్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు డీలర్‌షిప్స్ వద్ద లక్ష రూ., కంపెనీ ఆన్‌లైన్ పోర్టల్‌లో రూ. 50వేలతో బుకింగ్స్ కొనసాగించింది.
అయితే ఉన్నపళంగా ఆ బుక్సింగ్‌ను ఆపేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కానీ, ఇది తాత్కాలికమే అని పేర్కొంది. వాస్తవానికి బుకింగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఇది సప్లయ్‌కి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందుకే బుకింగ్‌ను టెంపరరీగా ఆపేశామని, త్వరలో మళ్లీ బుక్సింగ్స్‌ను కొనసాగిస్తామని కంపెనీ క్లారిటీ ఇచ్చింది.
Hilux టయోటా ఫార్చ్యూనర్ SUV వలె.. సేమ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది, అయితే ప్రస్తుతం ఇక్కడ మైక్రోస్కోపిక్‌గా ఉన్న విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవాలని చూస్తోంది. హైలక్స్‌కు సమీప ప్రత్యర్థిగా ఇసుజు V-క్రాస్‌ను భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment