దూసుకెళ్తున్న ఆటో రంగం.. మహారాష్ట్రలో వేలకోట్ల పెట్టుబడులు | Skoda Auto Volkswagen and Toyota Invest in Maharashtra | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తున్న ఆటో రంగం.. మహారాష్ట్రలో వేలకోట్ల పెట్టుబడులు

Published Mon, Sep 9 2024 1:55 PM | Last Updated on Mon, Sep 9 2024 1:55 PM

Skoda Auto Volkswagen and Toyota Invest in Maharashtra

స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చకాన్‌లో తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఏకంగా రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని క్యాబినెట్ మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.

స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా చకాన్‌ తయారీ కేంద్రంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను తయారు చేయనుంది. కంపెనీలో వెయ్యి కంటే ఎక్కువ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టయోటా కిర్లోస్కర్ కూడా రాష్ట్రంలో రూ. 21273 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ 8800 ఉద్యోగాలను కల్పించనుంది.

మహారాష్ట్రలో తన కొత్త ఉత్పత్తి యూనిట్‌ ద్వారా తమ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తామని, మెరుగైన హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తామని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అధికారులు వెల్లడించారు.

టయోటా కంపెనీ తమ ఛత్రపతి శంభాజీనగర్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక్కడ కంపెనీ హైబ్రిడ్ వెహికల్స్, ప్లగ్ఇన్ హైబ్రిడ్ వెహికల్స్,  ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే  వెల్లడయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement