![Toyota Kirloskar starts third shift at Karnataka plant to enhance production cut waiting period - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/18/toyota-car-production.jpg.webp?itok=n9aJdUUQ)
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్.. కర్నాటకలోని బెంగుళూరు వద్ద ఉన్న బిదాడి ప్లాంట్–1 ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచేందుకు మూడవ షిఫ్ట్‌ను ప్రారంభించింది. ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ వంటి ప్రసిద్ధ మోడళ్లలో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించాలన్నది కంపెనీ భావన. ఈ యూనిట్‌లో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడానికి కంపెనీ రూ.90 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టింది.
ఇదీ చదవండి: హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు
ప్లాంట్‌లో 3వ షిఫ్ట్ కోసం దాదాపు 1,500 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. ‘ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, ఫార్చ్యూనర్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌లో మూడవ షిఫ్ట్‌ని ప్రారంభించాం. ఈ ఉత్పత్తులు చాలా విజయవంతం అయ్యా యి. అలాగే వీటికి వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉంది. వేచి ఉండే కాలాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సుదీప్ ఎస్ దాల్వి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment