Fortuner
-
ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్.. కర్నాటకలోని బెంగుళూరు వద్ద ఉన్న బిదాడి ప్లాంట్–1 ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచేందుకు మూడవ షిఫ్ట్‌ను ప్రారంభించింది. ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ వంటి ప్రసిద్ధ మోడళ్లలో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించాలన్నది కంపెనీ భావన. ఈ యూనిట్లో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడానికి కంపెనీ రూ.90 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టింది. ఇదీ చదవండి: హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు ప్లాంట్‌లో 3వ షిఫ్ట్ కోసం దాదాపు 1,500 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. ‘ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, ఫార్చ్యూనర్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌లో మూడవ షిఫ్ట్‌ని ప్రారంభించాం. ఈ ఉత్పత్తులు చాలా విజయవంతం అయ్యా యి. అలాగే వీటికి వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉంది. వేచి ఉండే కాలాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సుదీప్ ఎస్ దాల్వి తెలిపారు. -
Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్?
బాబిడోస్ సింగర్ రిహాన రైటర్, నటి, ఫ్యాషన్ డిజైనర్ కూడా. ‘మ్యూజిక్ ఆఫ్ ది సన్’ ఆల్బమ్ ఆమెను లోకానికి పరిచయం చేసింది. ‘ఏ గర్ల్ లైక్ మీ’ రిహానను బిల్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో నిలిపింది. ‘గుడ్ గర్ల్ గాన్ బ్యాడ్’ ఆమెకు ఎంతో మంది అభిమానులను సంపాదించింది. ‘అంబ్రెల్ల’ పాట ‘గ్రామీ అవార్డ్’ను తెచ్చిపెట్టింది. మీరు ఏ కాస్త తీరిగ్గా ఉన్నా....‘వాట్స్ మై నేమ్’ పాటను అందుకోండి...‘యూ ఆర్ సో అమేజింగ్’ అని, ‘వుయ్ ఫౌండ్ లవ్’ పాటను ‘వుయ్ ఫౌండ్ లవ్ ఇన్ ఏ హోప్లెస్ ప్లేస్ ఎల్లో డైమండ్ ఇన్‌ది లైట్’ అంటూ బేషుగ్గా పాడుకోవచ్చు. ‘రిచెస్ట్ ఫిమేల్ మ్యూజిషియన్ ఆన్ ది ప్లానెట్’గా ఘనత సాధించిన రిహాన సెల్ఫ్–మేడ్ ఆర్టిస్ట్. రిహాన ‘రిచెస్ట్’ కావడానికి మ్యూజిక్ మాత్రమే కారణం కాదు...ఆమె మంచి ఎంటర్ప్రెన్యూర్ కూడా. చదవండి: పదేళ్ల బాలుడికి అంతర్జాతీయ యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు..!! -
ఫార్చూనర్ కొత్త వెర్షన్...
సాక్షి, న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రీమియం ఎస్యూవీ ఫార్చూనర్ కొత్త వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద దీని ధర రూ.29.98 –-రూ.37.43 లక్షల మధ్య ఉంది. మొత్తం ఏడు వేరియంట్లలో వస్తున్న ఈ కారు లెజెండర్ వేరియంట్ ధర రూ. 37.58 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త టయోటా ఫార్చూనర్ పెట్రోల్, డిజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. సీట్ వెంటిలేషన్ సిస్టమ్, ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థతో పాటు 11 స్పీకర్లతో జేబిల్ ఆడియో, ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ లాంటి లేటెస్ట్ ఫీచర్లను ఇందులో సమకూర్చారు. కొత్త డిజైన్ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కార్ల డెలివరీ త్వరలో ప్రారంభమవుతుంది. భారత్‌లో గడిచిన 11 ఏళ్లతో సుమారు 1.7 లక్షల ఫార్చూనర్ కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. -
టయోటా కొత్త ఫార్చూనర్ రూ.25.92 లక్షలు
న్యూఢిల్లీ: టయోటా తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘ఫార్చూనర్’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.25.92 లక్షలు-రూ.31.12 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. డీజిల్ వేరియంట్లో 2.8 లీటర్ ఇం జిన్ను, పెట్రోల్ వేరియంట్లో 2.7 లీటర్ ఇంజిన్‌ను అమర్చారు. కాగా కొత్త ఫార్చూనర్లో 7 ఎరుుర్ బ్యాగ్స, ఏబీఎస్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, 7 అంగుళాల టి-కనెక్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్/మాన్యువల్ ట్రాన్సమిషన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.