
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తాజాగా ‘కామ్రీ హైబ్రీడ్’ కారు కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో శుక్రవారం విడుదలచేసింది. దీని ప్రారంభ ధర రూ.36.95 లక్షలుగా ఉంటుందని తెలిపింది. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉండే ఈ కారు లీటరుకు 23.27 కి.మీ. మైలేజీనిస్తుంది.
ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్స్, బ్రేక్ హోల్డ్ ఫీచర్ మొదలైనవి ఉన్నాయి. మరోవైపు, ఈ తరహా హైబ్రీడ్ కార్ల ఉత్పత్తితో ఆటో పరిశ్రమ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సంస్థ ఎండీ మజకాజు యోషిమురా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment