మార్కెట్లోకి టయోటా ఇటియోస్ క్రాస్
న్యూఢిల్లీ: టయోటా కంపెనీ క్రాసోవర్ వాహనం, ఇటియోస్ క్రాస్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు రూ.5.76 లక్షల నుంచి రూ.7.4 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎండీ నవోమి ఇషి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 12వ ఆటో ఎక్స్‌పోలో ఈ వాహనాన్ని టయోటా కంపెనీ ఆవిష్కరించింది. మూడు విభిన్నమైన ఇంజిన్ ఆప్షన్లలలో ఈ వాహనాన్ని అందిస్తున్నామని నవోమి పేర్కొన్నారు. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ .5.76 నుంచి రూ.7.35 లక్షలు, డీజిల్ వేరి యంట్ల ధరలు రూ.6.9 లక్షల నుంచి రూ.7.4 లక్షల రేంజ్‌లో ఉన్నాయని వివరించారు.