
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టయోటా కొత్త కారు కొనేవారికి షాక్ ఇచ్చింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో తన అన్ని ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే, ధరలు ఎంత శాతం పెరగనుంది అనేది స్పష్టత ఇవ్వలేదు. కానీ, అక్టోబర్ 1, 2021 నుంచి కార్ల ధరలు మరింత ప్రియం కానున్నట్లు ధృవీకరించింది. ధరల పెరుగుదల అనేది మోడల్స్, వాటి వ్యక్తిగత వేరియెంట్లను బట్టి మారవచ్చు. ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల టయోటా ఉత్పత్తుల ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. (చదవండి: భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్ బైక్ ధరలు...!)
ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం అధిక రేటు, అధిక ఇంధన ధరల కారణంగా ఆటోమోటివ్ భాగాలు, కమాడిటీస్ & సరుకు ఛార్జీల ధరలు పెరగడం కారణంగా ఆ ధరలను వినియోగదారుల మీద తయారీ కంపెనీలు వేస్తున్నాయి. ఇతర ఆటోమేకర్లు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ధరలను పెంచాలని భావిస్తున్నారు. టయోటా ప్రస్తుతం గ్లాంజా, అర్బన్ క్రూయిజర్, ఇన్నోవా క్రైస్టా, ఫార్చ్యూనర్, క్యామ్రీ, వెల్ఫైర్లను సేల్ చేస్తుంది. యారిస్ సెడాన్ కారును మాత్రం టయోటా నిలిపివేసింది. గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ మాదిరిగానే టయోటా యారిస్ స్థానంలో మారుతి సుజుకి సియాజ్ ఆధారంగా కొత్త క్రాస్ బ్యాడ్జ్డ్ సెడాన్ ను ప్రవేశపెట్టాలని భావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment