
నాగచైతన్య, సాయి పల్లవి
థియేటర్లు తెరుచుకున్న వెంటనే ‘లవ్‌స్టోరీ’ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందని తెలిసింది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. నారాయణ్‌దాస్ కె నారంగ్, పి. రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ‘లవ్‌స్టోరీ’ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమాను థియేటర్స్ ఓపెన్ చేసిన వెంటనే విడుదల చేయాలనుకుంటున్నారట. థియేటర్స్‌లో వందశాతం సీటింగ్ సామర్థ్యం వచ్చేంతవరకు ఎదురు చూడకుండా యాభై శాతానికే అనుమతులు వచ్చినా సరే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ‘లవ్‌స్టోరీ’ నిర్మాతలు అనుకుంటున్నారని సమాచారం. జూలై చివర్లో లేదా ఆగస్టులో థియేటర్ల తాళాలు తెరుచుకుంటాయని భోగట్టా. వెంటనే ‘లవ్‌స్టోరీ’ థియేటర్స్‌కి వచ్చే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment