Sai Pallavi Comments on Kissing Scene From Love Story Movie- Sakshi
Sakshi News home page

Love Story Movie: ముద్దు సీన్‌పై స్పందించిన సాయిపల్లవి, అసలు విషయం ఏంటంటే..

Published Wed, Sep 29 2021 9:06 PM | Last Updated on Thu, Sep 30 2021 2:58 PM

Sai Pallavi Comments On Kiss Scene In Love Story Movie In a Interview - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత తెరుచుకున్న థియేటర్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. మహమ్మారి కాలంలో కూడా అధిక శాతం ప్రేక్షకులను థియేటర్లోకి రప్పించిన చిత్రంగా లవ్‌స్టోరీ మార్క్‌ తెచ్చుకుంది.  శుక్రవారం(సెప్టెంబర్‌ 24) విడుదలైన ఈ చిత్రం భారత్‌లోనే కాదు అమెరిక బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తోంది.  ఇందులో సాయి పల్లవి డ్యాన్స్‌, నాగ చైతన్య నటనకు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ మూవీ వరుసగా సక్సెస్‌, మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌ వేడుకులను కూడా జరుపుకుంది.

ఈ మూవీ సక్సెస్‌తో  హీరోహీరోయిన్లు వరుస ఇంటర్వ్యూలతో ఫుల్‌ బిజీగా మారారు. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి లవ్‌స్టోరీ విశేషాలను పంచుకుంది. అయితే ఈ సినిమాలో ఓ చోట సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య లిప్‌లాక్‌ సీన్‌ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్‌.. హీరోకు ముద్దు పెట్టి పరుగెత్తుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఈ ముద్దు సీన్‌పై సాయి పల్లవి స్పందిస్తూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.  

ఆమె మాట్లాడుతూ.. ‘ఆ స‌న్నివేశంలో నాగ‌చైత‌న్య‌ను నేను నిజంగా ముద్దు పెట్టుకోలేదు. కెమెరామెన్ ఆ స‌న్నివేశాన్ని నిజం అనిపించేలా కెమెరా యాంగిల్ పెట్టి సెట్ చేశారు. ఎందుకంటే ముద్దు సన్నివేశాల్లో నేనేప్పుడు న‌టించ‌లేదు. సినిమాకు డేట్స్‌ ఇచ్చేటప్పుడే ఇలాంటి సీన్ల‌లో న‌టించనని డైరెక్టర్లకు ముందే స్పష్టం చేస్తాను. అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్‌లో నటించమని డైరెక్టర్‌ శేఖ‌ర్ క‌మ్ముల కూడా న‌న్ను ఇబ్బంది పెట్ట‌లేదు. పాత్ర బాగుంటే ప‌ర్‌ఫార్మెన్స్ దానిక‌దే ఉత్త‌మంగా వ‌చ్చేసిస్తుంద‌నేది నా అభిప్రాయం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement