
Rajeev Kanakala About Chaysam Divorce: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసిన నాగ చైతన్య-సమంతల విడాకుల గురించే టాక్ నడుస్తోంది. నాలుగేళ్ల క్రితం(2017) పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. టాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా గుర్తింపు పొందారు. ఎలాంటి వివాదాలు లేకుండా నాలుగేళ్లుగా కలిసి ఉన్న ఈ ప్రేమ.. ఒక్కసారిగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో చై-సామ్‌ల అభిమానులు షాక్‌కు గురయ్యారు. వాళ్లు ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఎవరు? అంటూ మీడియా, సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఇక సినీ ప్రముఖులు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు. కొంతమంది సమంతకు మద్దతుగా మాట్లాడితే.. మరికొంతమంది చైతూకి అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా నాగ చైతన్య- సమంత విడాకులపై నటుడు రాజీవ్ కనకాల కూడా స్పందించారు.
(చదవండి: అందుకే సమంత దూరం జరిగింది : మాధవీలత)
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీలో రాజీవ్ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సక్సెస్, ఆ సినిమా షూటింగ్ తాలూకు విశేషాలను ఓ యూట్యూబ్ చానల్‌కు పంచుకున్న రాజీవ్ కనకాల.. చై-సామ్ విడాకులపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. నాగ చైతన్య- సమంత విడాకుల ఇష్యూ అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం అని, దాని గురించి ఏం మాట్లాడలేం అని చెప్పాడు. అయితే వారిద్దరు విడిపోవడం తనను బాధ కలిగించిందని చెప్పాడు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం సరికాదన్నాడు. రియల్ లైఫ్‌లో మాత్రం నాగ చైతన్య చాలా కూల్ పర్సన్ అని, ఆయన ఎక్కడా విసుగు చెందే మనస్తత్వం కాదని తెలిపాడు. సెట్‌లో అందరితో సరదాగా ఉంటూ తన పని తాను చెసుకొని వెళ్లేవాడని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment