‘ఏయ్‌ పిల్లా..’ వచ్చేస్తుంది | Naga Chaitanya Love Story Movie New Poster Released | Sakshi
Sakshi News home page

అందమైన ప్రేమకథ

Published Wed, Mar 11 2020 8:35 AM | Last Updated on Wed, Mar 11 2020 4:23 PM

Naga Chaitanya Love Story Movie New Poster Released - Sakshi

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఎమిగోస్‌ క్రియేషన్స్, సోనాలి నారంగ్‌ సమర్పణలో నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. హోలీ సందర్భంగా ఈ చిత్రం కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలోని ‘ఏయ్‌ పిల్లా..’ అంటూ సాగే మొదటి పాట పూర్తి లిరికల్‌ వీడియోను నేడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. హోలీ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ సినిమాకి సహ నిర్మాత : భాస్కర్‌ కటకంశెట్టి, సంగీతం: పవన్‌ సి.హెచ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement