![Love Story Movie Ay Pilla Musical Preview Released - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/14/Love-Story.jpg.webp?itok=4d5BZn_T)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఏయ్ పిల్లా..’ అంటూ సాగే పాట ప్రివ్యూను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్యకు ముద్దు పెట్టిన అనంతరం ‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..’అని సాయిపల్లవి చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. అలాగే నాగచైతన్య, సాయిపల్లవిల మధ్య వచ్చే కొన్ని సీన్లను ఈ మ్యూజికల్ ప్రివ్యూలో ప్రధానంగా చూపెట్టారు. సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ సీహెచ్ మంచి పాటను అందించినట్టుగా అర్థమవుతోంది.
కాగా, ఈ చిత్రాన్ని ఎమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్‌దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం.. వేసవిలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment