ఆ ఏడుపు ఎందుకో..? | Nayantara moved by Amarakaaviyam | Sakshi
Sakshi News home page

ఆ ఏడుపు ఎందుకో..?

Published Sat, Aug 23 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

ఆ ఏడుపు ఎందుకో..?

ఆ ఏడుపు ఎందుకో..?

వెండితెరపై జరుగుతున్నది నిజం కాదు.. కథ అని తెలిసినా బాగా లీనమైపోయి చూస్తుంటాం. తెరపై తారలు ఏడిస్తే.. ఒక్కొసారి మనం కూడా ఏడ్చేస్తాం. ఇటీవల నయనతార

 వెండితెరపై జరుగుతున్నది నిజం కాదు.. కథ అని తెలిసినా బాగా లీనమైపోయి చూస్తుంటాం. తెరపై తారలు ఏడిస్తే.. ఒక్కొసారి మనం కూడా ఏడ్చేస్తాం. ఇటీవల నయనతార కూడా అలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విషయంలోకి వస్తే... నయనతారకు మంచి మిత్రుడైన ఆర్య తమ్ముడు సత్య హీరోగా రూపొందిన ‘అమరకావ్యం’ చిత్రం త్వరలో విడుదల కానుంది.
 
 ఈ చిత్రాన్ని అత్యంత సన్నిహితులకు చూపించారు ఆర్య. ఈ చిత్రం చూసిన తర్వాత నయనతార అరగంటసేపు ఆపకుండా కన్నీళ్లు పెట్టుకున్నారని చెన్నయ్ టాక్. ఈ ప్రేమకథా చిత్రం ఆమెను అంతగా కదిలించింది. ఈ చిత్రం తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసిందని, అందుకే నయనతార అంతగా కదిలిపోయిందన్నది పలువురి అభిప్రాయం. ఈ సినిమా చూసిన ఐదు రోజుల తర్వాత చిత్రదర్శకుడు జీవా శంకర్‌కి ఫోన్ చేసి, చాలా బాగుందని నయనతార అభినందించారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement