
సినిమా విజయంపై పాటలు కూడా ప్రభావం చూపుతాయి. గతంలో చాలా సినిమాలు పాటల వల్లే విజయాన్ని సొంతం చేసుకున్నాయి. స్టోరీ యావరేజ్‌గా ఉన్నా.. పాటలు బాగుంటే చాలు సినిమా సేఫ్ జోన్‌కి వెళ్లడం ఖాయం. ప్రేక్షకులను థియేటర్స్‌కి తీసుకురావడంలో సాంగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దర్శక, నిర్మాతలు పాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇటీవల వచ్చిన పాటల్లో ‘సారంగ దరియా’కి బాగా ఆదరణ లభించింది.
మంగ్లీ గాత్రం, సాయిపల్లవి స్టెప్పులకు తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు. తెలంగాణ జానపదం కావడం, సుద్దాల అశోక్ తేజ లిరిక్స్‌కి, పవన్ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట అతి తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్ల వ్యూస్, 1.2 మిలియన్ల లైకులను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలోనే తమ సినిమా పాటకు 150 మిలియన్ల వ్యూస్ రావడం పట్ల ‘లవ్‌స్టోరీ’ యూనిట్ హర్షం వ్యక్తం చేస్తుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన చిత్రం "లవ్‌స్టోరీ". రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment