
క్లాసిక్ చిత్రాలతో హిట్ కొట్టే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఎలాంటి కమర్షయల్ ఎలిమెంట్స్ లేకున్నా విజయవంతమైన సినిమాలు తీయడంలో ఆయనది ప్రత్యేక స్టైల్. ఆయన రూపొందించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న శేఖర్ కమ్ముల తాను డైరెక్ట్ చేసిన సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మొదటగా ఫిదా మూవీని మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌లకు చెప్పానని, వాళ్లు ఆ కథను రిజెక్ట్ చేశారని దీంతో ఆ ప్రాజెక్ట్ వరుణ్‌తేజ్ దగ్గరకు వెళ్లిందని పేర్కొన్నారు. ఇక తన ఫస్ట్ మూవీ ఆనంద్ తనకు ఎంతో స్పెషల్ అని, ఈ సినిమా చిరంజీవి నటించిన 'శంకర్ దాదా' ఒకే రోజు రిలీజ్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా రిలీజైన వారం తర్వాత పలువురు పొగడ్తలతో ముంచేశారని, ఆ సినిమా సూపర్‌హిట్ అవుతుందనే నమ్మకం తనకు ముందు నుంచీ ఉందని పేర్కొన్నాడు. ఇక లవ్‌స్టోరి సినిమాలోని సారంగదరియా వివాదంపై స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment