2021 చార్ట్ బస్టర్స్ నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సినిమాల సంఖ్య తగ్గినా ప్రతి చిత్రంలోనూ ఒక పాట యూట్యూబ్ రికార్డ్స్ ను టార్గెట్ చేసింది. ఏడాది అంతా రిపీట్ మోడ్ లో పెట్టుకుని విన్నారు ఆడియెన్స్. ఆ సాంగ్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
సాయి పల్లవి ‘సారంగ దరియా’
యూట్యూబ్ లో సాయి పల్లవి సాంగ్స్ అంటే రికార్డ్స్ కు కేరాఫ్ అడ్రస్ అనే మాట స్థిరపడిపోయింది. ఈ ఏడాది సారంగ దరియాతో అలాంటి సెన్సేషన్ సృష్టించింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల డైరెక్టర్ చేసిన లవ్ స్టోరీలోని ఈ సాంగ్ యూట్యూబ్ లో 4.5 కోట్లకు పైగా వ్యూస్ అందుకుంది.
అదరగొట్టిన ‘బుల్లెట్ బండి’
సినిమా సాంగ్స్ కు తెలంగాణ ఫోక్ సాంగ్స్ గట్టి పోటీని ఇస్తున్నాయి. వ్యూస్ విషయంలో స్టార్ హీరోస్ సాంగ్స్ ను మించిపోతున్నాయి. బుల్లెట్ బండి అలాంటి రేర్ రికార్డ్ నెలకొల్పింది. మ్యారేజ్ ఈవెంట్ లో తప్పక వినిపించే పాటగా మారింది. మోహనా భోగరాజు సింగింగ్ సెన్సేషన్ గా మారింది.
లవర్స్ ఫేవరేట్ సాంగ్‌గా ‘ఒకే ఒక లోకం నువ్వే’
శ్రీనివాస నాయుడు డైరెక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా శశి. మార్చిలో థియేటర్స్ లో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపకపోయినా యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమాలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఏకంగా 150 మిలియన్ కు పైగా వ్యూస్ అందుకుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిడ్ శ్రీరామ్ పాడాడు.
మనసు దోచిన ‘శ్రీవల్లీ’
పుష్ప తెలుగు వర్షన్ సాంగ్స్ లో శ్రీవల్లీ ఎక్కువగా వ్యూస్ అందుకుంది. ఈ పాట 100 మిలియన్ కు పైగా వ్యూస్ అందుకుని మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు పరుగులు తీస్తోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు. అలాగే ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా’కూడా యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది.
‘లాహే లాహే’
చిరు నటిస్తున్న కొత్త చిత్రం ఆచార్య. ఈ మూవీ నుంచి ఇప్పటికీ రెండు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. వాటిల్లో లాహే లాహే రికార్డ్ స్థాయిలో వ్యూస్ అందుకుంది. 2021లో యూట్యూబ్ ను షేక్ చేసింది.రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించాడు. హారిక నారాయన్, సాహితీ చాగంటి కలసి పాడారు. యూట్యూబ్ లెక్కల ప్రకారం ఈ సాంగ్ వ్యూస్ 100 మిలియన్ దాటాయి.
Comments
Please login to add a commentAdd a comment