చై, సాయి పల్లవి ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌: 'లవ్‌స్టోరీ' వాయిదా | Naga Chaitanya, Sai Pallavi Love Story Movie Release Postponed | Sakshi
Sakshi News home page

'లవ్‌స్టోరీ' సినిమా రిలీజ్‌ వాయిదా

Published Thu, Apr 8 2021 7:18 PM | Last Updated on Thu, Apr 8 2021 8:04 PM

Naga Chaitanya, Sai Pallavi Love Story Movie Release Postponed - Sakshi

లవ్‌స్టోరీ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కావడం లేదంలూ ఆ మధ్య వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై చిత్రబృందం స్పందిస్తూ.. ఈ సినిమా విడుదల విషయంలో ఎటువంటి కన్‌ఫ్యూజన్‌ లేదని, ముందుగా చెప్పిన డేట్‌కే రిలీజ్‌ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ ప్రేమకథ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుందని చై, సాయిపల్లవి అభిమానులు తెగ సంతోషపడిపోయారు. కానీ అంతలోనే చిత్రయూనిట్‌ ప్లేటు ఫిరాయించింది. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని లవ్‌స్టోరీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు గురువారంనాటి మీడియా సమావేశంలో ప్రకటించింది. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన చిత్రం "లవ్‌స్టోరీ". రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించారు. కె. నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించారు.

చదవండి: సింగర్‌ కోమలిపై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement