Saranga Dariya Song Became Hit Because Of Me Says Komali, Gets Trolled By Netizens - Sakshi
Sakshi News home page

సింగర్‌ కోమలిపై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

Published Fri, Apr 2 2021 12:32 PM | Last Updated on Fri, Apr 2 2021 10:09 PM

Netizens Fires On Singer Komali About Saranga Dariya Song - Sakshi

లవ్‌స్టారీ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట గత కొన్ని రోజులుగా యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. "దాని కుడి భుజం మీద కడువా... దాని కుత్తెపు రైకలు మెరియా.." అంటూ సాగే ఈ పాట అంతలా మార్మోగిపోతోందీ. యూట్యూబ్‌లో విడుదలైన కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించి అన్ని రికార్డులు సృష్టించింది. సింగర్ మంగ్లీ పాడిన ఈ పాటలోని మాస్ బీట్, సాయి పల్లవి ఎనర్జిటిక్‌ డాన్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ప్రేక్షకులు సైతం ఈ పాటకు స్టెప్పులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే  'సారంగ దరియా..' ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అదే స్థాయిలో వివాదమూ చుట్టుముట్టింది.

పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ గాయని కోమలి పేర్కొన్న సంగతి తెలిసిందే. పిలిచిన ప్రతీ చానెల్ వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర నిర్వహించిన షోలో కోమలి మరోసారి సారంగదరియా పాటను ఆలపించింది. 'లవ్ స్టోరీ' సినిమాలో తన పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యిందని పేర్కొంది. తాజాగా దీనికి సంబంధించిన ఫ్రోమోను విడుదల చేశారు. ఇది చూసిన నెటిజన్లు కోమలిపై దుమ్మెత్తిపోస్తున్నారు. సారంగ దరియా పాటకు న్యాయం చేసింది సింగర్‌ మంగ్లీ అని, తన వల్లే పాట హిట్‌ అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు. మంగ్లీ ఈ పాటకు జీవం పోసింది కాబట్టే సారంగ దరియా అంత సక్సెస్‌ అయ్యిందని, అసలు మీ వాయిస్‌ సాయ్‌ పల్లవికి సూట్‌ అయ్యేది కాదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. 

చదవండి : 'డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల న్యాయం చేస్తానని మాటిచ్చారు'
సారంగదరియా.. 100 మిలియన్ల వ్యూస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement