సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్‌స్టోరి’ మూవీ రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది. తాజాగా ఈ మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అమెరికాలో లవ్‌స్టోరీ విడుదలైన 3 రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల (రూ.7 కోట్ల 37 లక్షలు) వసూళ్లు రాబట్టింది. ఆదివారం రాత్రి వరకు 2021లో అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా లవ్‌స్టోరీ నిలిచింది.
చదవండి: Pushpa: ‘పుష్ప’ షూటింగ్ జరిగిన లొకేషన్‌ని షేర్ చేసిన మేకర్స్
ఓ తెలుగు సినిమా మూడు రోజుల్లో యూఎస్‌లో 1 మిలియన్ల డాలర్లోకి వెళ్లడమంటే సాధారణ విషయం కాదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రికార్డుల స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా లవ్‌స్టోరీ నిలిచింది. మూడు రోజుల్లో యూఎస్‌లో 1 మిలియన్ల డాలర్ల క్లబ్‌లోకి లవ్‌స్టోరీ చేరటం విశేషం. దీంతో లవ్‌స్టోరీ 2 మిలియన్ల డాలర్ల మైల్‌స్టోన్ దిశగా వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఫిల్మ్ దునియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు తొలిరోజు లవ్‌స్టోరీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లను వసూళ్లు చేసిందట. ఒక యూఎస్‌లోనే 2.9 కోట్ల కలెక్షన్లను రాబట్టి, సెంకడ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపెనింగ్ కలెక్షన‍్లను రాబట్టిన చిత్రంగా లవ్‌స్టోరి నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు అటుఇటుగా రూ. 6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల మాట.
Comments
Please login to add a commentAdd a comment